ETV Bharat / sports

కోహ్లీపై దాదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​.. ఏమన్నాడంటే?

author img

By

Published : Sep 11, 2022, 3:59 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​, డాషింగ్ బ్యాటర్​ కోహ్లీ గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి తనకంటే ఎక్కువ ఆడగలిగే సత్తా ఉందని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే..

kohli dada
bcci president sourav ganguly on virat kohli

టీమ్ ​ఇండియా మాజీ కెప్టెన్లు గంగూలీ, కోహ్లీకి మధ్య చాలా పోలికలున్నాయి. ఇద్దరూ భారత జట్టుకు సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా నాయకత్వం వహించారు. మైదానంలో వీరు దిగితే దూకుడుగా ఆడతారు. మ్యాచ్ ఆసాంతం ఉద్వేగభరితంగా ఉంటారు. వారి చర్యలు, వారు జట్లను నడిపించే విధానం కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కాబట్టి వీరిద్దరిని పోల్చుతూ కామెంట్లు, పోస్టులు రావడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే తాజాగా దీనిపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.

'పోలిక ఎప్పుడూ కూడా మన అగ్రెస్సివ్ నెస్ బట్టి ఉండకూడదు. ఎవరి నైపుణ్యం ఎంతుందో దాన్ని బట్టి ఉండాలి, కోహ్లీ తన కంటే ఎక్కువ నైపుణ్యం గల ప్లేయర్ అని' దాదా అన్నాడు. వారి దూకుడు ఆధారంగా కోహ్లీతో పోల్చడం గురించి గంగూలీని 'ది రణవీర్ షో'లో హోస్ట్ అడగగా గంగూలీ ఈ విధంగా బదులిచ్చాడు. 'అది పోలిక అని నేను అనుకోను. ఆటగాడిగా నైపుణ్యం పరంగా పోలిక ఉండాలి. అతను (కోహ్లీ) నా కంటే ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటాడని నేను భావిస్తున్నాను. మేము వేర్వేరు తరాలలో ఆడాం. ఇద్దరం చాలా క్రికెట్ ఆడాం. బహుశా నా కంటే అతను ఎక్కువ ఆటలు ఆడగలడు. ప్రస్తుతం గణాంకాల పరంగా నేను అతని కంటే ఎక్కువగా ఆడినట్లు కన్పించినా.. అతను దాన్ని అధిగమించగలడు. అతను అద్భుతమైన ప్లేయర్' అంటూ గంగూలీ కొనియాడాడు.

కోహ్లీ చాలా కాలం పాటు పేలవమైన ఫామ్‌తో బాధపడ్డాడు. అయితే ఇటీవల ఆసియా‌కప్‌లో తిరిగి తన ఫామ్ అందుకున్నాడు. ఈ మధ్యలోనే రెండు హాఫ్ సెంచరీలు బాది తన స్ట్రైక్​​ రేట్​ను పెంచుకున్నాడు. అలానే టీ20 కెరీర్లో తన మొదటి సెంచరీని కూడా నమోదు చేశాడు. అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 122పరుగులు బాది నాటౌట్​గా నిలిచాడు. తద్వారా భారత్ తరఫు అత్యధిక టీ20ల్లో అత్యధిక స్కోర్​ చేసిన వాడిగా నిలిచాడు. ఇక 2019 నవంబరు తర్వాత కోహ్లీ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ కెరీర్లో 71 సెంచరీలను పూర్తి చేసి ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్‌ రికార్డును సమం చేశాడు. అయితే వీరిద్దరి కంటే సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో తొలిస్థానంలో ఉన్నాడు.

ఇవీ చదవండి: యూఎస్​ ఓపెన్​ విజేతగా ఇగా స్వైటెక్‌.. తొలి క్రీడాకారిణిగా రికార్డు

'లాఫ్టెడ్​ షాట్​'తో అదరగొట్టిన సచిన్​.. వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.