ETV Bharat / sports

టీమ్​ ఇండియాకు కొత్త కోచ్​.. బీసీసీఐ ప్రకటన!

author img

By

Published : Oct 17, 2021, 3:27 PM IST

Updated : Oct 17, 2021, 3:48 PM IST

టీమ్​ ఇండియా పురుషుల జట్టు ప్రధాన కోచ్​ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

BCCI invites application for coaching staff of Indian men's team
టీమ్​ ఇండియాకు కోచ్​ కావలెను

భారత పురుషుల జట్టు కొత్త కోచింగ్​ బృందం కోసం.. భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్​ కోచ్​, బ్యాటింగ్​, బౌలింగ్​, ఫీల్డింగ్​ కోచ్​ పదవులకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నిర్దేశించిన గడువులోగా అప్లికేషన్లు సమర్పించాలని స్పష్టం చేసింది.

జాతీయ క్రికెట్​ అకాడమీలోనూ(ఎన్​సీఏ) పలు ఖాళీలనూ భర్తీ చేయనుంది.

అర్హతలు..

  • వయసు 60 ఏళ్లకు మించరాదు.
  • ప్రధాన కోచ్​ పదవికి అప్లై చేసేవారు.. కనీసం 30 టెస్టు మ్యాచ్​లు లేదా 50 వన్డే మ్యాచ్​లు ఆడినవారై ఉండాలి. లేదా
  • పూర్తిస్థాయి టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు హెడ్​ కోచ్​గా పనిచేసి ఉండాలి. లేదా
  • దేశవాళీ లీగ్​లు, ఐపీఎల్​/ ఇతర అంతర్జాతీయ లీగ్​లు, నేషనల్​-ఏ టీమ్​లకు కనీసం మూడేళ్ల ప్రధాన కోచ్​గా చేసుండాలి.

కీలక తేదీలివే..

  • హెడ్​ కోచ్​- అక్టోబర్​ 26 సాయంత్రం 5 గంటలలోగా అప్లికేషన్లు స్వీకరిస్తారు.
  • బ్యాటింగ్​, బౌలింగ్​, ఫీల్డింగ్​ కోచ్​​- నవంబర్​ 3 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది.

ద్రవిడే ఖాయం..

ఇండియా క్రికెట్​ టీమ్​కు.. ప్రస్తుతం ఎన్​సీఏ హెడ్​ కోచ్​గా ఉన్న రాహుల్​ ద్రవిడే తదుపరి కోచ్​ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పిన వేళ.. బోర్డు ఈ నోటిఫికేషన్​ విడుదల చేయడం గమనార్హం. ద్రవిడ్​ నియామకం ఖాయమే అయినప్పటికీ, కోచింగ్​ ప్రక్రియను పద్ధతి ప్రకారమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్​ రెండేళ్ల కాంట్రాక్ట్​కు ఒప్పుకున్నట్లు సమాచారం.

లోధా కమిటీ సూచనల ప్రకారం.. కోచ్​ ఎంపిక క్రికెట్​ సలహా కమిటీనే(సీఏసీ) చేపట్టాలి. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా, ఇంటర్వ్యూలకు ఎవరు వచ్చినా.. ద్రవిడ్​ ఎంపిక లాంఛనమే అన్నది బోర్డు వర్గాల సమాచారం. ద్రవిడ్​ టీమ్​ ఇండియా కోచ్​ అయ్యాక అండర్​-10, ఇండియా-ఏ జట్లకు కొత్త కోచ్​లను నియమించే అవకాశం ఉంది. ఎన్​సీఏ బాధ్యతలను కూడా మరొకరికి అప్పగించవచ్చు.

యూఏఈలో జరిగే 2021 టీ-20 వరల్డ్​కప్​ ముగిసిన అనంతరం.. హెడ్​ కోచ్​ రవిశాస్త్రి సహా ప్రస్తుత కోచింగ్​ బృందం పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త బృందం వేటలో పడింది బీసీసీఐ.

Last Updated : Oct 17, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.