ETV Bharat / sports

భారత క్రికెట్​ బోర్డుకు రూ.995 కోట్లు నష్టం.. ఇదే కారణం!

author img

By

Published : Oct 14, 2022, 4:17 PM IST

వచ్చే ఏడాది నిర్వహించే వన్డే వరల్డ్​ కప్​నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే దీని వల్ల బీసీసీఐ రూ.955 కోట్ల మేర నష్టపోనుంది. ఎందుకంటే..

icc one day world cup 2023
2023 World Cup

భారత క్రికెట్​ బోర్డు బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లనుంది. కేంద్ర ప్రభుత్వం పన్ను ఉపశమనం ఇవ్వకపోతే ఈ క్రికెట్​ బోర్టు రూ.955 కోట్ల మేర నష్టపోనుంది. ఈ మేరకు బోర్డు ఓ నివేదికలో పేర్కొంది. అయితే వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్​లో జరగనున్న పురుషుల వన్డే వరల్డ్​ కప్​నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. కానీ ఈ వరల్డ్​ కప్​ ప్రసారాల ద్వారా సమకూరే ఆదాయంపై కేంద్రం ప్రభుత్వం 21.84 శాతం పన్ను(సర్​చార్జ్)​ విధించింది. ఇందులో కిటుకేంటంటే ఐసీసీ నిర్వహించే టోర్నీలకు ఆతిథ్య దేశం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలి. కానీ ఈ మినహాయింపు కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ఇవ్వలేదు.

అయితే ఇలాంటి మెగా టోర్నీలకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వకపోవడం ఇది రెండోసారి. 2016లో భారత్​లో జరిగిన వన్డే వరల్డ్​ కప్​లో బీసీసీఐ రూ.193 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఆ కేసు గురించి బీసీసీఐ ఇంకా ఐసీసీ ట్రైబ్యునల్​లో​ పోరాటం చేస్తోంది.

"పురుషుల ఐసీసీ మెగా ఈవెంట్​ అక్టోబర్​-నవంబర్​ 2023లో భారత్​లో జరగనుంది. అయితే ఐసీసీకి పన్ను మినహాయింపు అందించాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది. ఈ మినహాయింపు ఇవ్వడానికి కాలపరిమితిని ఐసీసీ బోర్డు 2022 మే 31 వరకు పొడిగించింది. తాత్కాలిక చర్యగా 10 శాతం పన్ను ఆర్డర్‌ను పొందవచ్చు. అయితే పన్ను మినహాయింపు కారణాల వల్ల ఐసీసీ నష్టపోయిన మొత్తాన్ని బీసీసీఐ షేర్​ నుంచి ఐసీసీకి సర్దుబాటు చేస్తారనే విషయం గమనించాలి" అని బీసీసీఐ రాష్ట విభాగాలకు ఓ నివేదిక సర్క్యులేట్ అయింది. అక్టోబర్ 18న బీసీసీఐ సర్వసభ్య సమావేశానికి ముందు ఇలా జరగడం గమనార్హం.

అయితే ఈ పన్ను మినహాయింపు కోసం బీసీసీఐ ఇంకా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అధికారులతో చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం పన్ను శాతాన్ని 21.84 నుంచి 10.92 శాతానికి తగ్గించినా.. బీసీసీఐకి రూ.430 కోట్ల మేర నష్టం నుంచి ఉపశమనం కలుగుతుంది. 2016 నుంచి 2023 మధ్యకాలంలో ఐసీసీ నుంచి బీసీసీఐకి వచ్చిన మొత్తం ఆదాయం వాటా విలువ దాదాపు రూ.3336 కోట్లు ఉండటం గమనార్హం. అయితే 2023లో భారత్​లో జరగబోయే వన్డే వరల్డ్​ కప్​ నుంచి ఐసీసీకి దాదాపు రూ.4400 కోట్ల ఆదాయం సమకూరనుంది.

ఇవీ చదవండి: T20 worldcup: అన్ని లక్షల టికెట్లు అమ్ముడైపోయాయా?

సచిన్​లా అలా చేయాలని ఆశించా.. కానీ అది చాలా కష్టం: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.