ETV Bharat / sports

Aus vs Ned World Cup 2023 : నెదర్లాండ్స్​ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా.. 309 పరుగుల భారీ తేడాతో ఆసీస్ ఘన విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 8:32 PM IST

Updated : Oct 25, 2023, 10:44 PM IST

Aus vs Ned World Cup 2023
Aus vs Ned World Cup 2023

Aus vs Ned World Cup 2023 : మెగాటోర్నలో ఆస్ట్రేలియా మూడో విజయం నమోదు చేసింది. అక్టోబర్ 25 బుధవారం దిల్లీ వేదికగా నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో 309 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Aus vs Ned World Cup 2023 : 2023 వరల్డ్​కప్​లో ఆస్ట్రేలియా మూడో విజయం నమోదు చేసింది. మెగాటోర్నీలో భాగంగా బుధవారం నెదర్లాండ్స్​తో తలపడ్డ ఆస్ట్రేలియా.. 309 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 400 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పసికూన నెదర్లాండ్స్.. తేలిపోయింది. పదునైన ఆసీస్ బౌలింగ్​ను ఎదుర్కోలేక 21 ఓవర్లలో 90 పరుగులకు చేతులెత్తేసింది. 25 పరుగులు చేసిన విక్రమ్​జిత్ సింగ్​ జట్టులో టాప్​స్కోరర్​. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మరోసారి 4 వికెట్లతో మెరిశాడు. మిచెల్ మార్ష్ 2, కమిన్స్, హజెల్​వుడ్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. మెరుపు శతకంతో అదరగొట్టిన మ్యాక్స్​వెల్​కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో ఆరు పాయింట్లతో ఆసీస్ పట్టికలో నాలుగో ప్లేస్​లో కొనసాగుతోంది.

పసికూన టపటాపా.. ఛేదనలో పసికూన నెదర్లాండ్స్.. ఆసీస్​కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు పారేసుకుంది. ఆసీస్ బౌలింగ్​ దెబ్బకు డచ్​ జట్టులో సగం మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యారు. స్పిన్నర్ ఆడమ్ జంపా దెబ్బకు నెదర్లాండ్స్​ బ్యాటర్లు.. క్రీజులో నిలువలేకపోయారు.

మ్యాక్స్​వెల్ అదుర్స్.. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. నెదర్లాండ్స్​పై దండయాత్ర చేసింది. తొలుత డేవిడ్ వార్నర్ శతకంతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్, లబూషేన్ హాఫ్ సెంచరీలతో రాణించాకు. ఇక ఆఖర్లో మాత్రం మ్యాక్స్​వెల్ ఆట మ్యాచ్​కే హైలైట్. అతడు ఆకాశమే హద్దుగా చెలరేగి బౌండరీలతో డచ్ జట్టుపై విరుచుకుపడ్డాడు. ఆసీస్ ఇన్నింగ్స్​లో 46.2 ఓవర్ల వద్ద ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మ్యాక్స్​వెల్.. 48.4 వద్ద 100 పరుగుల మార్క్ అందుకున్నాడంటే అతడి విధ్వసం ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే 40 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి.. వరల్డ్​కప్​ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఈ సెంచరీని.. ఇటీవల పుట్టిన తన కుమారుడికి అంకితం ఇచ్చాడు మ్యాక్స్​వెల్.

ఆసీస్​ జెర్సీలకు నలుపు బ్యాండ్​.. ఈ మ్యాచ్​లో ఆసీస్ ప్లేయర్లు నలుపు బ్యాండ్ ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ ఫహాద్ అహ్మద్, నాలుగు నెలల వయసున్న కుమారుడు ఇటీవల మరణించాడు. దీంతో అతడి కుటుంబానికి ఈ విధంగా సంతాపం తెలుపుతున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది.

  • The thoughts of the Australian Cricket community are with former Australian spinner Fawad Ahmed after the passing of his young son.

    Our condolences are with Fawad, his family and friends in this terribly difficult time ❤️

    — Cricket Australia (@CricketAus) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Aus vs Ned World Cup 2023 : 'వార్నర్' మెరుపులు.. 'మ్యాక్స్​వెల్' ఊచకోత.. ప్రపంచకప్​లోనే ఫాస్టెస్ట్ సెంచరీ

World Cup 2023 Pak Vs Aus : పాక్​కు షాక్​.. ఆసీస్​ ఘన విజయం

Last Updated :Oct 25, 2023, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.