ETV Bharat / sports

Asia Cup 2023 Team India Bowling : టీమ్ఇండియా బౌలర్ల హవా.. మూడుసార్లు అంటే మాటలు కాదండోయ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 2:55 PM IST

Asia Cup 2023 Team India Bowling : 2023 ఆసియా కప్​లో టీమ్ఇండియా ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అసాధారణ రీతిలో దుసుకుపోతోంది. టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్​ల్లో మూడు సార్లు ప్రత్యర్థి జట్లను ఆలౌట్​ చేసింది.

Asia Cup 2023 Team India Bowling
Asia Cup 2023 Team India Bowling

Asia Cup 2023 Team India Bowling : 2023 ప్రపంచకప్​ సమీపిస్తున్న నేపథ్యంలో టీమ్ఇండియా బౌలింగ్​ గురించి ఇప్పటికే అనేక సార్లు చర్చ జరిగింది. మెగా టోర్నమెంట్​లో ఆయా జట్ల మేటి బ్యాటర్లకు.. భారత బౌలర్లు ఎలా కళ్లెం వేస్తారన్నది అందోళనకరంగా మారింది. అయితే భారత బౌలింగ్ దళం ప్రస్తుత ఆసియా కప్​లో అదరగొడుతోంది. ఈ టోర్నీలో భారత్.. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్​ల్లో 3 సార్లు ప్రత్యర్థి జట్లను ఆలౌట్​ చేసింది. దీంతో భారత్​ బౌలింగ్ మెరుగుపడిందని టీమ్ఇండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ప్రపంచ కప్​లోనూ ఇదే జోరు ప్రదర్శించాలని ఆశిస్తున్నారు. మరి ఈ మూడు మ్యాచ్​ల్లో టీమ్ఇండియా బౌలర్ల ప్రదర్శనపై ఓ లుక్కేద్దాం..

భారత్ వర్సెస్ నేపాల్ (230/10).. టోర్నీలో భారత్ తమ రెండో మ్యాచ్​లో నేపాల్​ను ఢీ కొట్టింది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక పసికూన నేపాల్​.. ఇన్నింగ్స్​ను ఘనంగానే ఆరంభించినా.. ఆ తర్వాత లయ కోల్పోయింది. పేసర్​ మహమ్మద్ సిరాజ్, ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ధాటికి నేపాల్ నేపాల్.. క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఇక నేపాల్​ 48.1 ఓవర్లలో 230 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్​లో జడేజా 3, సిరాజ్ 3, షమీ, హార్దిక్ పాండ్య, శార్దుల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.

  • A solid opening partnership and some late striking by Sompal Kami has propelled Nepal to a total of 230!

    Will the Indian batters chase this down with ease, or can Nepal successfully defend the total and create history? 💪#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/rsr6vIre8R

    — AsianCricketCouncil (@ACCMedia1) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్ వర్సెస్ పాకిస్థాన్ (128/10).. పాక్​తో తొలి మ్యాచ్​లో భారత్​కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఆ లోటును సూపర్​ 4లో సోమవారం జరిగిన మ్యాచ్​తో భర్తీ చేశారు భారత బౌలర్లు. 357 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. టీమ్ఇండియా బౌలర్ల ధాటికి పాక్.. విలవిల్లాడింది. స్టార్ స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు. ఓపెనర్ ఫకప్ జమాన్​ సహా.. 5 వికెట్లతో అదరగొట్టాడు. ఫలితంగా పాక్ ఇన్నింగ్స్​ 32 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్​లో భారత్ 228 పరుగుల తేడాతో గెలుపొందింది.

భారత్ వర్సెస్ శ్రీలంక (172/10).. సూపర్​ 4లో భారత్ రెండో మ్యాచ్​లో శ్రీలంకతో తలపడింది. అయితే ఈ మ్యాచ్​లో స్పిన్నర్ల హవా కొనసాగింది. ఫ్లాట్​పిచ్​పై ఇరుజట్ల స్పిన్నర్లు విజృంభించారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 49.1 ఓవర్లలో 213 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక ఛేదనలో శ్రీలంక బ్యాటర్లను.. స్పిన్నర్లు కుల్​దీప్ (4 వికెట్లు), రవీంద్ర జడేజా (2 వికెట్లు)తికమక పెట్టారు. బంతిని గింగిరాలు తిప్పుతూ.. టపటపా వికెట్లు పడగొట్టారు. 41.3 ఓవర్లకు.. 172 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్ 41 పరుగుల తేడాతో గెలుపు బావుట ఎగురవేసి.. మరో మ్యాచ్​ మిగిలుండగానే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.

  • 2 wins in 2 days for Team India! 🇮🇳

    Kuldeep Yadav's brilliant 4-wicket haul and the disciplined efforts of India's pacers were the defining moments in a low-scoring showdown against Sri Lanka, resulting in a 41-run victory! #AsiaCup2023 #INDvSL pic.twitter.com/eokXOPQ9xe

    — AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asia Cup 2023 Leading Wicket Taker : ప్రస్తుత టోర్నమెంట్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా.. టీమ్ఇండియా స్పిన్నర్ కుల్​దీప్ టాప్​లో ఉన్నాడు. మూడు మ్యాచ్​ల్లో కలిపి అతడు 9 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగె (9), పాక్ పేసర్ హరీస్ రౌఫ్ (9), బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ (9).. కుల్​దీప్​తో పాటు టాప్​లో కొనసాగుతున్నారు.

KL Rahul Asia Cup 2023 : వాట్​ ఏ కమ్​ బ్యాక్ రాహుల్​.​.. ఆ ఒక్క పనితో ధోనీని గుర్తుచేశావుగా!

Score Big Savings on ICC Cricket World Cup 2023 Travel : క్రికెట్​ వరల్డ్​ కప్​నకు వెళ్తున్నారా..? విమాన టికెట్లు, హోటల్ రూమ్స్​పై భారీ ఆఫర్లు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.