ETV Bharat / sports

Asia Cup 2023 IND Vs BAN : బంగ్లా ఇన్నింగ్స్​ కంప్లీట్​.. ఆదుకున్న కెప్టెన్​.. భారత్ లక్ష్యం ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 6:45 PM IST

Updated : Sep 15, 2023, 7:41 PM IST

Asia Cup 2023 IND Vs BAN : 2023 ఆసియా కప్​ సూపర్-4లో చివరి మ్యాచ్​లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్​ ముగిసింది. బంగ్లా స్కోర్ ఎంతంటే?

Asia Cup 2023 Ind vs Ban
Asia Cup 2023 Ind vs Ban

Asia Cup 2023 IND Vs BAN : 2023 ఆసియా కప్​ సూపర్ 4లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న పోరులో.. బంగ్లా ఇన్నింగ్స్​ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లా ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ (80 పరుగులు), హ్రిదోయ్ (54 పరుగులు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివర్లో ససుమ్ అహ్మద్ (44), మెహిదీ హసన్ (29) రాణించారు. భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, మహమ్మద్ షమీ 2, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.

ఆరంభంలో తడబాటు.. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్​కు మంచి ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్​ మూడో ఓవర్లలోనే ఓపెనర్ లిట్టన్ దాస్(0)ను.. పేసర్ మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్​ చేశాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ తన్​జీద్ హసన్​ (10)ను శార్దూల్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల.. బంగ్లాదేశ్ పరుగులు చేయలేకపోయింది. 13.6 ఓవర్లకు బంగ్లా 59-4తో కష్టాల్లో పడింది.

  • Bangladesh have shown remarkable resilience after a shaky start, posting 265 on the board. Shakib and Hridoy's outstanding 50s led the way, and some late fireworks from the lower order have given them a competitive total.

    Can India chase down the total? #AsiaCup2023 #INDvBAN pic.twitter.com/6BSflBNHTQ

    — AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆదుకున్న కెప్టెన్.. కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను.. కెప్టెన్ షకీబ్ ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ హ్రిదోయ్​తో కలిసి (101 పరుగులు) శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇక చివర్లో అహ్మద్, మెహిదీ హసన్ రాణించడం వల్ల బంగ్లా పోరాడగలిగే స్కోర్ చేసింది.

జడేజా @ 200.. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లా ఇన్నింగ్స్​లో 34.1 ఓవర్ వద్ద జడేజా.. షమీమ్ హసన్ (1)ను ఎల్​బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో జడేజా వన్డేల్లో 200 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో భారత్​ తరఫున 2500కు పైగా పరుగులు, 200 వికెట్లు పడగొట్టిన రెండో ఆల్​రౌండర్​గా నిలిచాడు. ఈ జాబితాలో జడేజా కంటే ముందు కపిల్ దేవ్ ఈ ఫీట్ సాధించాడు. ఇక ఆసియా కప్​(వన్డే ఫార్మాట్​) లో భారత్​ తరఫున అత్యధిక వికెట్లు (25) తీసిన తొలి బౌలర్​గా రికార్డులకెక్కాడు.

ICC ODI Rankings : పాకిస్థాన్​కు షాకిచ్చిన టీమ్​ఇండియా.. నెం.1గా ఆసీస్​.. కొత్త లెక్కలు ఇవే!

Asia Cup 2023 Final IND Vs SL : ఆసియా కప్​లో 'లంక' ఆటే వేరు.. కొలంబోలో వారిదేపైచేయి.. భారత్​కు గట్టి సవాలే!

Last Updated : Sep 15, 2023, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.