ETV Bharat / sports

Ashwin On Friendship Comments : 'టీమ్ఇండియా ఆటగాళ్లు ఫ్రెండ్స్​గా మారడం కష్టం'.. వ్యాఖ్యలపై స్పందించిన అశ్విన్​

author img

By

Published : Aug 18, 2023, 6:24 PM IST

Updated : Aug 18, 2023, 6:57 PM IST

Ashwin On Friendship Comments
Ashwin On Friendship Comments

Ashwin On Friendship Comments : టీమ్​ఇండియా ఆటగాళ్లు స్నేహితులుగా మారడం కష్టమంటూ చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్​. ఆ వ్యాఖ్యలను అభిమానులు మరో విధంగా అర్థం చేసుకున్నారని అన్నాడు. ఇంతకీ వివాదం ఏంటంటే?

Ashwin On Friendship Comments : ప్రస్తుత తరం భారత జట్టులోని ఆటగాళ్లు స్నేహితులుగా మారడం కష్టమని ఇటీవల వ్యాఖ్యానించాడు సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌. ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. యూట్యూబ్ వేదికగా తాను చేసిన వ్యాఖ్యలపై అశ్విన్ తాజాగా స్పందించాడు. ఆయన ఏమన్నారంటే?

నా వ్యాఖ్యలను మరోలా అర్థం చేసుకున్నారు..
Ravichandran Ashwin Youtube Channel : 'నేను చేసిన వ్యాఖ్యలను బయట మరో విధంగా అర్థం చేసుకున్నారు. నేను చెప్పిన అంశం ఒకటి.. అభిమానులు అర్థం చేసుకున్నదొకటి. గతంలో టీమ్​ఇండియా పర్యటనలు చాలా ఎక్కువ కాలం సాగేవి. అప్పుడు ఆటగాళ్ల మధ్య స్నేహం కుదరడానికి ఎక్కువ అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుత కాలంలో మాత్రం మూడు వేర్వేరు ఫార్మాట్లను ఎక్కువగా ఆడుతున్నాం. వేర్వేరు జట్లుగా విడిపోయి బరిలోకి దిగుతున్నాం. అందుకే, వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం వల్ల ఆటగాళ్ల మధ్య స్నేహం కుదరడానికి ఆస్కారం తక్కువగా ఉందని భావిస్తున్నా. అదేవిధంగా ఐపీఎల్‌ ఉండటం వల్ల కూడా ఆటగాళ్ల మధ్య స్నేహం కంటే పోటీ పెరిగింది. దాదాపు 3 నెలలపాటు భారత జట్టులోని సహచరులే ప్రత్యర్థులుగా మారతారు. అలాగనీ స్నేహం కుదరకుండా ఉండదని చెప్పడం లేదు. కానీ, అలా అయ్యేందుకు ఆస్కారం తక్కువని చెబుతున్నా' అని అశ్విన్ అన్నాడు.

ధోనీ మాటలు గుర్తున్నాయి..
ఇటీవల విండీస్​తో​ జరిగిన టీ20 సిరీస్​లో హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ఓడిపోయింది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలపై కూడా రవిచంద్రన్​ అశ్విన్ స్పందించాడు. సోషల్ మీడియాలో విమర్శించడం తేలికేనని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా గతంలో ఎంఎస్ ధోనీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు అశ్విన్​. 'మిస్టర్ కూల్​ ఎంఎస్ ధోనీ, కొంతమంది కోచ్‌లు నాకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఓటమి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అదే గెలిచినప్పుడూ నేర్చుకోగలిగిన వారే ఛాంపియన్‌లుగా మారతారని చెప్పారు. కాబట్టి ప్రతి సిరీస్‌ నుంచి నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉంటాయి' అని అశ్విన్‌ తెలిపాడు.

Ashwin about West Indies Stadiums : విండీస్​ మైదానాలపై అశ్విన్ ఫైర్.. 'పచ్చిక లేదు.. నెట్స్‌ కూడా చాలా పాతవి..'

IND VS WI 2023 : అశ్విన్​ 10 వికెట్ల ప్రదర్శన.. తొలి టెస్టులో రికార్డులు ఇవే..

Last Updated :Aug 18, 2023, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.