ETV Bharat / sports

గ్రూప్ స్టేజ్​లో బెస్ట్ పెర్ఫార్మర్స్​ - టీమ్ఇండియా ప్లేయర్లదే డామినేషన్!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 5:33 PM IST

2023 World Cup Best Performers
2023 World Cup Best Performers

2023 World Cup Best Performers: 2023 ప్రపంచకప్​ లీగ్ దశ ముగిసింది. 45 మ్యాచ్​లు జరిగిన గ్రూప్​ స్టేజ్​లో అత్యుత్తమ ప్రదర్శనలేంటో మీకు తెలుసా?

2023 World Cup Best Performers : 2023 వరల్డ్​కప్ గ్రూప్ స్టేజ్ ముగిసింది. 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో 6 జట్లు ఇంటిబాట పట్టాయి. మిగిలిన 4 జట్ల మధ్య టైటిల్ పోరు మరింత రసవత్తరంగా ఉండనుంది. లీగ్​లో మొత్తం 45 మ్యాచ్​లు జరిగాయి. ఈ మ్యాచ్​లు.. సంచలన విజయాలు, ఉత్కంఠ భరిత ఇన్నింగ్స్​లు, కళ్లు చేరిరే క్యాచ్​లు, అబ్బురపరిచే సిక్స్​లతో క్రికెట్ ప్రేమికులకు కావల్సినంత వినోదాన్ని పంచాయి. ఒక్కో మ్యాచ్​ను ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లది మంది వీక్షించారు. అయితే ఈ లీగ్​ దశలో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనలు ఏవో మీకు తెలుసా?

  • అత్యధిక పరుగులు.. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన లిస్ట్​లో, టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్​లో ఉన్నాడు. అతడు 9 మ్యాచ్​ల్లో 99.00 సగటుతో 594 పరుగులు బాదాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
  • అత్యధిక సెంచరీలు.. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్.. ఈ టోర్నీలో అదరగొడుతున్నాడు. అతడు ప్రస్తుత టోర్నీలో అందరికంటే ఎక్కువ సెంచరీలు (4) బాది.. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
  • అత్యుత్తమ సగటు.. టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మెగాటోర్నీలో 99.00 సగటుతో టాప్​లో ఉన్నాడు.
  • టాప్ స్ట్రైక్ రేట్.. ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్​వెల్ ఈ టోర్నీలో 152.69 స్టైక్​ రేట్​తో బ్యాటింగ్ చేశాడు.
  • అత్యధిక సిక్స్​లు.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇప్పటివరకు 24 సిక్స్​లు బాదాడు. ఈ క్రమంలో టోర్నీలో ఎక్కువ సిక్స్​లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.
  • అత్యధిక వ్యక్తిగత స్కోర్.. ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ మ్యాక్స్​వెల్ (201*).. ఈ టోర్నీలో డబుల్ సెంచరీ బాదాడు. అతడు అఫ్గానిస్థాన్​పై వీరోచిత పోరాటం చేసి ఆసీస్​ను విజయతీరాలకు చేర్చాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్​గా రికార్డుకొట్టాడు.
  • అత్యధిక వికెట్లు.. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా లీగ్​ దశలో 22 వికెట్లు పడగొట్టి.. టాప్​లో కొనసాగుతున్నాడు.
  • బెస్ట్ ఎకనమీ.. భారత పేస్ బౌలర్ జస్​ప్రీత్ బుమ్రా.. టోర్నీలో అందరికంటే బెస్ట్​ ఎకనమీతో బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ ఎకనమీ 3.65 గా ఉంది.
  • బెస్ట్ బౌలింగ్ ఇన్నింగ్స్.. టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ.. టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. ​అతడు శ్రీలంకపై 18 పరుగులిచ్చి.. 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ టోర్నీలో ఇదే ఇప్పటివరకు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.

విరాట్, డికాక్, రోహిత్ - పరుగుల వరద పారించిన టాప్ 10 బ్యాటర్లు

వికెట్లు తీసిన రోహిత్​, కోహ్లీ- ఒకే మ్యాచ్​లో 9 మంది బౌలింగ్​, 31 ఏళ్ల తర్వాత రికార్డ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.