ETV Bharat / sports

ఈ ఏడాది టెస్టుల్లో 'సూపర్ స్టార్స్' వీరే!

author img

By

Published : Dec 26, 2021, 10:22 AM IST

India top performance cricketers 2021: ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం, ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఓటమి, ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​తో జరిగిన సిరీస్​ల్లో విజయం.. ఇది ఏడాది టీమ్​ఇండియా టెస్టు క్రికెట్​ ప్రయాణం. అయితే ఈ జర్నీలో కొందరు భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో క్రికెట్​ ప్రేమికులను ఆకట్టుకున్నారు. వారి గురించే ఈ కథనం..

2021-india-top-performance-cricketers
ఈ ఏడాది భారత్​ టాప్​ ప్లేయర్స్​ వీరే

India top performance cricketers 2021: అంతర్జాతీయ క్రికెట్​లో ఈ ఏడాది టెస్టు క్రికెట్​ అభిమానులను విపరీతంగా అలరించింది. టీమ్​ఇండియా విషయానికొస్తే ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్​ విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించిన భారత జట్టు.. ఆ తర్వాత కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఓటమి ఫ్యాన్స్​ను నిరాశకు గురిచేసింది. అయితే ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​తో జరిగిన సిరీస్​ల్లో విజయం సాధించింది. ఇక ఈ ఏడాది పూర్తయ్యేటప్పటికి దక్షిణాఫ్రికాతో మరో సిరీస్​ ఆడనుంది. ఏదేమైనప్పటికీ గెలుపోటములతో ఈ సంవత్సరాన్ని పూర్తి చేసిన టీమ్ఇండియాలో టెస్టు ఫార్మాట్​ పరంగా కొందరు భారత ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో క్రికెట్​ ప్రేమికులను ఆకట్టుకున్నారు. వారెవరో తెలుసుకుందాం..

ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన

Axar patel five wicket haul: ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లాండ్​తో టెస్టు​ సిరీస్​ ఆడింది టీమ్​ఇండియా. ఇందులో భాగంగా రెండో మ్యాచ్​ ద్వారా టెస్టు​ అరంగేట్రం చేశాడు అక్షర్ పటేల్. ఈ మ్యాచ్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​తో జరిగిన హోమ్​ సిరీస్​ల్లో టీమ్​ఇండియా విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా ఇప్పటివరకు ఐదు మ్యాచ్​లు ఆడి 36 వికెట్లు తీశాడు. ఇందులో ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ​ చేయడం విశేషం.

axar patel
అక్సర్​ పటేల్​

అసాధారణ పోరాటం

Bumrah lord test innings: బుమ్రా ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా టెస్టు​ క్రికెట్​లో తనవంతుగా ఉత్తమంగా ఆడి గుర్తుండిపోయే ప్రదర్శనలు చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్​లు ఆడిన ఇతడు 25 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్​తో లార్డ్స్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో అతడు మహ్మద్​ షమీతో కలిసి చేసిన బ్యాటింగ్​ క్రికెట్​ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. డ్రాతో గట్టెక్కాల్సిన మ్యాచ్​ను వీరిద్దరూ అసాధారణ పోరాటం చేసి గెలుపు దిశగా నడిపించారు. ఈ మ్యాచ్​లో భారత్​ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

bumrah
బుమ్రా

విమర్శలకు సమాధానం

Rishabh pant Australia tour: వికెట్​ కీపర్​ పంత్​.. ఈ ఏడాది ఆకట్టుకునే ప్రదర్శన చేసి తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు. 2021లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఏడాది ప్రారంభంలో గబ్బా టెస్టు​ విజయంలో 97, 89* పరుగులతో కీలకంగా వ్యవహరించి అభిమానుల మనసుల్లో నిలిచాడు. మొత్తంగా ఈ ఏడాది 11 మ్యాచ్​లు ఆడి 41.52 సగటుతో 706 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి.

panth
పంత్​

విదేశీ గడ్డపై తొలి సెంచరీ

Rohit sharma first overseas test century: రోహిత్​ శర్మ.. ఈ ఏడాది టెస్టు​ క్రికెట్​లో అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో అత్యధిక పరుగులు చేసిన ఆడగాడిగా నిలిచాడు. ఓవల్​ టెస్టు​ మ్యాచ్​లో సెంచరీ చేసి.. విదేశీ గడ్డపై తన తొలి టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. మొత్తంగా ఈ ఏడాది 11 మ్యాచ్​లు ఆడి 47.68 సగటుతో 906 రన్స్​ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. ​

rohithsharma
రోహిత్​ శర్మ

అత్యధిక వికెట్లు తీసిన ఘనత

Ravichandran ashwin wickets in 2021: రవిచంద్రన్ అశ్విన్​.. ఈ ఏడాది నిలకడగా రాణించాడు. ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​తో జరిగిన సిరీస్​ల్లో మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​ను దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన, చెన్నై వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో సెంచరీ చేసి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తాడు. మొత్తంగా ఈ ఏడాది ఎనిమిది మ్యాచ్​ల్లో 50 వికెట్లు తీసి అత్యధిక వికెట్లను పడగొట్టిన ప్లేయర్​గా నిలిచాడు.

ashwin
అశ్విన్​

ఇదీ చూడండి: ఆ అపురూప క్షణాల్ని గొప్పగా ఆవిష్కరించారు: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.