ETV Bharat / sports

ప్రాక్టీస్​కు గంట సరిపోతుందా?- సైనా అసహనం

author img

By

Published : Jan 5, 2021, 10:30 PM IST

saina nehwal on BWF
ప్రాక్టీస్​కు గంట సరిపోతుందా?- సైనా అసహనం

థాయ్​లాండ్​లో జరగనున్న టోర్నీల్లో ఫిజియోలను, శిక్షణ ఇచ్చే వారిని అనుమతించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది భారత షట్లర్​ సైనా నెహ్వాల్. కొవిడ్​ దృష్ట్యా బ్యాడ్మింటన్​ వరల్డ్​ ఫెడరేషన్​ పెట్టిన నిబంధనలపై మరోసారి దృష్టిసారించాలని ట్వీట్​ చేసింది.

థాయ్​లాండ్​ వేదికగా జరగనున్న టోర్నీల్లో బ్యాడ్మింటన్​ వరల్డ్​ ఫెడరేషన్ విధించిన నిబంధనలపై మండిపడింది సైనా నెహ్వాల్. టోర్నీల్లో.. ఫిజియోలకు, శిక్షణ ఇచ్చేవారికి అనుమతి ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు బీడబ్ల్యూఎఫ్ త్వరలో పరిష్కారం చూపాలని ట్విట్టర్​ వేదికగా కోరింది.

"శిక్షణ ఇచ్చేవారు, జట్టు వైద్యులు టోర్నీ ముగిసే వరకూ మమ్మల్ని కలిసే అవకాశం లేదు. అందరికీ కరోనా నెగటివ్​గా నిర్ధరణ అయినా ఈ నిబంధన ఎందుకు?. నాలుగు వారాలు ఎవరి గైడెన్స్​ లేకుండా మేం ఎలా ఆడాలి?. మంచి కండిషన్​లో ఈ టోర్నీ ఆడాలనుకుంటున్నాం. ఫిజియోలను, కోచ్​లను మాతో పాటు తీసుకురావడానికి చాలా డబ్బు ఖర్చు చేశాం. వీరిని అనుమతించరనే నిబంధనల గురించి ముందుగానే ఎందుకు చెప్పలేదు. జిమ్​లో వ్యాయామం చేసుకునేందుకూ ఎక్కువ సమయం కేటాయించలేదు. ఈ సమస్యలను బ్యాడ్మింటన్​ వరల్డ్ ఫెడరేషన్​ వీలైనంత త్వరగా పరిష్కరించాలి."

-సైనా నెహ్వాల్, భారత బ్యాడ్మింటన్​ ప్లేయర్.

కరోనా ఉద్ధృతి దృష్ట్యా బీడబ్ల్యూఎఫ్ థాయ్​లాండ్​ ఓపెన్​కు కొన్ని నిబంధనలు పెట్టింది. బయోబబుల్​లోనే టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. సరైన శిక్షణ లేకుండా బరిలోకి దిగడం శ్రేయస్కరం కాదని భావిస్తోంది భారత ప్లేయర్ సైనా. దీని ప్రభావం టోక్యో ఒలింపిక్స్​పై ఉంటుందని అంటోంది.

ఇదీ చదవండి:స్కూల్​ లెవల్​​ క్రికెట్​ ఆడుతున్నారు: అక్తర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.