ETV Bharat / sitara

వామ్మో! బిగ్‌బాస్‌కు సల్మాన్‌ పారితోషికం అంతనా?

author img

By

Published : Sep 20, 2021, 8:34 PM IST

salman
సల్మాన్​

హిందీ బిగ్​బాస్​కు(hindi bigg boss 2021) హోస్ట్​గా వ్యవహరిస్తున్న సల్మాన్​ ఖాన్(bigg boss salman remuneration)​.. ఈ షోకు రెమ్యునరేషన్​ ఎంత తీసుకుంటారో తెలుసా? తెలిస్తే షాక్​ అవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆయన పారితోషికం ఎంతంటే?

రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కు(hindi bigg boss 2021) ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై వినోదానికి చిరునామాగా నిలిచే ఈ షో.. హిందీలో బిగ్‌బాస్‌-15 సీజన్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ దీనికి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 14 వారాల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి సల్మాన్(bigg boss salman remuneration)​.. అక్షరాలా రూ.350కోట్లు తీసుకుంటున్నారని బి-టౌన్‌ టాక్‌. వరుసగా బిగ్‌బాస్‌ పదకొండు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఈ కండలవీరుడు.

అంతేకాదు.. టీవీ షోల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోల్లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హోస్ట్‌గా నిలిచాడు 'సుల్తాన్'. గత సీజన్ల వారీగా సల్మాన్‌ఖాన్‌ ఒక్కో వారానికి ఎంత ఆర్జించాడంటే.. (సీజన్‌ 4 - 6) వరకూ రూ.2.5 కోట్లు, (సీజన్‌-7)కి రూ.5 కోట్లు (సీజన్‌-13)కి రూ.13కోట్లు తీసుకున్నారు.

నాగార్జునకు ఎంతంటే

బిగ్‌బాస్‌ తెలుగుకు గత మూడేళ్లగా హోస్ట్‌గా అలరిస్తున్నారు హీరో అక్కినేని నాగార్జున(nagarjuna bigg boss salary). ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్‌-5కు వ్యాఖ్యాతగా రూ.11-12 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. గతేడాది ప్రసారమైన సీజన్‌-4కు రూ.8కోట్లు తీసుకున్న నాగ్‌(nagarjuna bigg boss remuneration) ఈఏడాది అమాంతం తన పారితోషికాన్ని పెంచేశారు. సీజన్‌-3కు ఒక్కో వారానికి రూ.12 లక్షలు తీసుకున్నారట.


ఇదీ చూడండి: మాస్, క్లాస్​.. సినిమా ఏదైనా నాగ్​ రూటే సపరేటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.