ETV Bharat / sitara

అవమానాలు భరించి.. కష్టాల కడలి దాటి.. సరికొత్త జీవితం దిశగా!

author img

By

Published : Aug 30, 2021, 8:29 PM IST

ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించే సుధీర్​, శ్రీను, నరేశ్​ ఇంకా మిగతా 'జబర్దస్త్'​ కంటెస్టెంట్​లు.. తమ కెరీర్​లో ఈ స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు, తినడానికి తిండి లేక పస్తులు ఉన్న రోజులు వారి జీవితాల్లో చాలానే ఉన్నాయి. ఓ సారి వారి కష్టాల కడలి గురించి తెలుసుకుందాం..

extra jabardast
ఎక్స్​ట్రా జబర్దస్త్​

బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌'. రష్మీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఈ ఎంటర్​టైనర్​ షో 350వ ఎపిసోడ్​ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం సహా భావోద్వేగానికి గురి చేసింది. షోలో కేక్​ కట్​ చేసి సరదాగా ఎంజాయ్​ చేయడం సహా కన్నీరు పెట్టుకున్నారు కంటెస్టెంట్​లు.

రాకింగ్​ రాకేష్-రోహిణి కిస్​

టిక్​టాక్​ దుర్గారావు దంపతులు రాకింగ్​ రాకేష్-రోహిణి స్కిట్​లో స్పెషల్​ ఎప్పియరెన్స్ ఇచ్చి​ నవ్వులు పూయించారు. ​ఇందులో భాగంగానే ఇటీవల విమర్శలు ఎదుర్కొన్న తమ ముద్దు సన్నివేశాన్ని గురించి వివరిస్తూ ఈ సారి ఏకంగా లిప్​ లాక్​​తో అలరించారు రాకేష్​-రోహిణి జంట. స్కిట్​లో భాగంగా రజనీకాంత్ 'శివాజి' సినిమాలోని పాటకు బుల్లెట్​ భాస్కర్​-వర్ష చేసిన డ్యాన్స్​ పెర్​ఫార్మెన్స్​ అదిరిపోయింది. ఇక ఈ డ్రామాలో ఇమ్మాన్యుయేల్​ చేసిన కామెడీ సూపర్​. అతిలోకసుందరిగా గెటప్​ శ్రీను, చిరంజీవిగా రాంప్రసాద్​, మాంత్రికుడిగా సుడిగాలి సుధీర్​ చేసిన స్కిట్​ కితకితలు పెట్టించింది.

కంటతడి

కార్యక్రమం చివర్లో 'జబర్దస్త్'​ ఆర్టిస్టుల 'లైఫ్​ జర్నీ' స్కిట్​లు కన్నీరుపెట్టించాయి. తమ కెరీర్​లో ముందుకెళ్లే క్రమంలో సుధీర్​, గెటప్​ శ్రీను, నరేశ్​, ఇమ్మానుయేల్​, మిగతా కంటెస్టెంట్​లు తాము, తమ కుటుంబాలు ఎదుర్కొన్న కష్టాలు, చేదు సంఘటనలు, అవమానాలు కళ్లకు కట్టినట్లు చూపించి ఏడ్పించేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్​ సెప్టెంబరు 3న ప్రసారం కానుంది. అప్పటివరకు ప్రోమోను చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రోజా వర్సెస్​ ఇంద్రజ- సెకండ్​ ఇన్నింగ్స్​లోనూ హోరాహోరీ పోటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.