ETV Bharat / sitara

నా జీవితంలో అది పెద్ద ఆస్కార్: పృథ్వీరాజ్

author img

By

Published : Feb 2, 2021, 1:14 PM IST

ఆలీతో సరదాగా సెలబ్రిటీ టాక్ షోకు హాజరయ్యారు నటులు కృష్ణ భగవాన్​, పృథ్వీరాజ్​. ఈ సందర్భంగా వీరిద్దరూ తమదైన శైలి వెటకారంతో షో ఆసాంతం నవ్వులు పూయించారు.

Alitho Saradaga Prudhvi Raj
నా జీవితంలో అది పెద్ద ఆస్కార్: పృథ్వీరాజ్

తాను చెప్పిన శకుని డైలాగ్స్‌ విని మహానటుడు ఎన్టీఆర్‌ ఎంతగానో మెచ్చుకున్నారని నటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి నటుడు కృష్ణభగవాన్‌తో కలిసి వచ్చి సందడి చేశారు పృథ్వీ. ఈ సందర్భంగా వీరిద్దరూ తమదైన శైలిలో వెటకారంగా మాట్లాడుతూ.. షో ఆసాంతం నవ్వులు పంచారు.

'ఓ సందర్భంలో శకుని డైలాగ్ చెబితే ఓ లెజెండరీ నటుడు శభాష్ అని మెచ్చుకున్నారట? ఎవరు?' అని ఆలీ ప్రశ్నించగా దానిపై స్పందించారు పృథ్వీరాజ్. "బాలయ్య బాబు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 'దానవీరశురకర్ణ'లో శకుని డైలాగ్ చెబితే.. 'ఊరకనే డైలాగ్​లు చెప్పడం కాదురా.. ఎవడైనా చెబుతాడు. డిక్షన్ కావాలి, మాడ్యూలేషన్ కావాలి. అవన్నీ ఉంటేనే పర్​ఫెక్ట్. ఆ 'దానవీరశూరకర్ణ' ఆడియో కానీ వీడియో కానీ కొనుక్కో. దానిలో ఉన్న అన్ని క్యారెక్టర్​లూ నేర్చుకో. అదే ఇన్​స్టిట్యూషన్. రామరావుగారూ తెల్లవారుజామున 3 గంటలకు రామకృష్ణ స్టూడియోలో ఆయన మయసభలో ఏ డైలాగ్స్ అయితే చెప్పాడో ఆ డైలాగ్స్, పట్టాభిషేకం అప్పుడు చెప్పిన డైలాగ్స్ అవన్నీ డబ్బింగ్ చేసి నాగరాలో ప్లే చేసి యాక్ట్ చేశారట. పర్​ఫెక్షన్ కోసం. అదీ యాక్టర్స్ లైఫ్. నువ్వు ఏదో ఉన్నావా, వెళ్లావా ఈ డైలాగ్​లు కాదు. నువ్వు ఏదైనా పర్​ఫామ్ చేసేటపుడు ఈ డైలాగ్ గుర్తుపెట్టుకుని అవకాశం వస్తే పెద్దాయన ముందు చెప్తావా?'

"అలా ఓ సమయంలో ఎన్టీఆర్​ గారి దగ్గరికి వెళ్లా. అప్పుడు అపోసిషన్​లో ఉన్నారు. ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు. నాతో పాటు మేకప్ మెన్ వచ్చాడు. అప్పుడు ఆయనుండి 'ఇప్పుడు మేము వేరే పార్టీ. మీరు వెళ్లి కాళ్లమీద పడితే తేడాలొస్తాయి' అన్నారు. కానీ ఫస్ట్ పడిపోయింది ఆయనే. 'హే బ్రదర్ లెగండి' అన్నారాయన. లేచినంటెనే నేను కాళ్లదగ్గర కూర్చున్నా దండం పెట్టి. 'ఏ ఊరు మీది?' తాడెపల్లిగూడెం అండి. 'కళామతల్లి మీకు మంచి ఫేస్ అదీ ఇది' అంటూ చెప్పాక అప్పుడు మా నాన్న గారి గురించి చెప్పా. బాలిరెడ్డి సుబ్బారావు గారు మా నాన్నగారండి అని.. 'హే బాలిరెడ్డి సుబ్బారావు కొడుకా నువ్వు' అన్నారాయన. మా నాన్న గారికి ఆయన 'కృష్ణార్జున యుద్ధం' డ్రామాలో కర్ణుడి పాత్ర ఇచ్చారట. 'చూశావా నువ్వు నాకు వ్యతిరేకంగా'.. సార్ నాకు అవన్నీ ఏమీ తెలియదు సార్. 'ఓ డైలాగ్ చెప్పండి.' నేను ఇలాగ అంటూ ఉంటే 'నాది కాదు. వేరే ఏదైనా క్యారెక్టర్ చెప్పండి.' అప్పుడు శకుని డైలాగ్ చెప్పా. అప్పుడు ఆయన బొట్టు పెట్టి.. పదిరూపాయల కాగితంపై సంతకం పెట్టి 'గౌరవనీయులైన తమ్ముడు పృథ్వీరాజ్​కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రామారావు అభినందనలతో' అని పెట్టారు. అప్పుడు అపోజిషన్​ లీడర్ ఆయన. 'ఐయామ్ హావింగ్ కాన్ఫిడెంట్స్ నెక్స్ట్ ఐయామ్ ద సీఎం' అన్నారాయన. అది తీస్కున్నాను. అది ఆస్కార్ అవార్డు నాకు లైఫ్​లో" అంటూ చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.