ETV Bharat / sitara

Priyamani: 'ఎన్టీఆర్​ కోసమే 'యమదొంగ'లో నటించా'

author img

By

Published : Jun 25, 2021, 5:32 PM IST

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' (Alitho Saradaga) టాక్​షోకు హాజరైన హీరోయిన్​ ప్రియమణి(Priyamani).. తన జీవితంలోని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. హీరోయిన్​గా తన కెరీర్​లో విశేషాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.

Priyamani Interview in Alitho Saradaga
Priyamani: 'ఎన్టీఆర్​ కోసమే యమదొంగలో నటించా'

'మగాళ్లు వట్టి మాయగాళ్లే..' అంటూ వెండితెరపై స్టెప్పులేసిన హీరోయిన్​ ప్రియమణి(priyamani).. నిజజీవితంలోనూ తనకు కొంతమంది మాయగాళ్లు ఎదురైనట్లు చెప్పారు. తనకు నచ్చిన వాళ్లను ఇష్టాన్ని వ్యక్తం చేస్తే.. వాళ్లు తనను ఫ్రెండ్​జోన్​లోకి నెట్టేశారని 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) కార్యక్రమంలో వెల్లడించారు. ఆమె సినీ ప్రయాణంలోని విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ పంచుకున్నారు.

'యమదొంగ' ఎవరి కోసం..

'యమదొంగ' చిత్రంలో నటించేందుకు ఎవరి కోసం ఒప్పుకున్నారు? రాజమౌళి(Rajamouli), ఎన్టీఆర్(NTR)​ కోసమా? అని వ్యాఖ్యాత ఆలీ ప్రశ్నించగా.. ఎన్టీఆర్​ కోసమే ఆ సినిమాకు అంగీకరించినట్లు ప్రియమణి వెల్లడించారు. ఆ తర్వాత షూటింగ్​లో రాజమౌళి కుటుంబసభ్యులు కూడా మరింత దగ్గరయ్యారని ఆమె తెలిపారు. ఎప్పటికైనా అల్లు అర్జున్(Allu Arjun)​, రామ్​చరణ్​(Ram Charan)లతో నటించాలని ఉందని తన మనసులోని బయట పెట్టారు ప్రియమణి.

కాలేజీ రోజుల్లో రోజుకో అబ్బాయి తనను ఫాలో అయ్యేవారని ప్రియమణి తెలిపారు. తెలుగు పరిశ్రమలో రాజమౌళి, పూరీ జగన్నాథ్​, రామ్​గోపాల్​ వర్మ వంటి దర్శకులతో పనిచేయడం చాలా ఆనందాన్ని కలిగించిందని ఆమె వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. హీరోయిన్​కు చేదు అనుభవం.. ఫ్రైడ్​​రైస్​లో బొద్దింక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.