ETV Bharat / sitara

Paruchuri Brothers Movies: 'ఎన్టీఆర్ కలుద్దామంటే కుదరదన్నాను'

author img

By

Published : Sep 24, 2021, 3:20 PM IST

పరుచూరి బ్రదర్స్.. పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటివరకు 350కు పైగా చిత్రాలకు(Paruchuri Brothers Movies) కథలు, డైలాగులు అందించారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోకు అతిథులుగా విచ్చేసిన పరుచూరి బ్రదర్స్.. 40ఏళ్ల సినీకెరీర్​లో ఎన్నో ఆసక్తికర విషయాలు వారి మాటల్లోనే..

paruchuri brothers
పరుచూరి బ్రదర్స్

తమ 40 ఏళ్ల సినీ కెరీర్​లో 350 పైగా చిత్రాలకు(Paruchuri Brothers Movies) కథ, డైలాగులు అందించామని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. తెలుగు, తమిళం, మలయాళం, ఒడిస్సీ, బంగాలీ.. ఇలా ప్రాంతంతో తేడా లేకుండా అన్ని భాషల చిత్రాలకు కథలు అందించామని అన్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) షోకు గతంలో అతిథులుగా విచ్చేసిన పరుచూరి బ్రదర్స్.. తమ సినీ కెరీర్​ గురించిన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

ఎన్టీఆర్ కలుద్దామంటే వద్దన్నా

'చండశాసనుడు' సినిమా కథ కోసం.. ఎన్టీఆర్ కలుద్దామంటే తాను కుదరదని చెప్పానని గుర్తుచేసుకున్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. ఆ సమయంలో తాను ఆడిట్​ అధికారిగా ఉన్నానని.. అందువల్ల సాయంత్రం కుదరదు, మరుసటి రోజు వస్తానని చెప్పానన్నారు. ఆ తర్వాతి రోజు కలిసి కథ చెప్పానని తెలిపారు.

అదృష్టవశాత్తు బతికాం..

ఆదుర్తి సుబ్బారావు మరో ప్రపంచం సినిమాలో తాను మొదటగా నటించినట్లు పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు. కలెక్షన్ కింగ్ మోహన్​బాబుతో తమకు విడదీయరాని ఆత్మీయబంధం ఉందని అన్నారు. ఓసారి కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లినప్పుడు కారు ప్రమాదం జరిగిందని.. అదృష్టవశాత్తు బతికామని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.

చిరంజీవి 'ఖైదీ' సినిమాతో పాటు 'ఖైదీ నం.150' సినిమాకూ తామే కథను అందించటం చాలా సంతోషంగా ఉందని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. వీటితో పాటు ఈ అన్మదమ్ములు చెప్పిన మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: సినీ రచనా దమ్ము చూపించిన అన్నదమ్ములు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.