ETV Bharat / sitara

'పెళ్లి చూపులు' దర్శకుడితో యంగ్​టైగర్!​

author img

By

Published : Apr 1, 2020, 7:08 PM IST

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​, తరుణ్​ భాస్కర్​ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడట. ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సినీవర్గాల్లో వినిపిస్తోంది. త్రివిక్రమ్​తో చిత్రం పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు​ పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది.

Young Tiger NTR to be directed by Tarun Bhaskar?
తరుణ్​భాస్కర్​ దర్శకత్వంలో నటించనున్న యంగ్​టైగర్!​

'పెళ్లి చూపులు' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ఆ తర్వాత నటుడిగానూ తనని తాను నిరూపించుకున్నాడు. అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌తో తరుణ్‌ ఓ చిత్రం చేయబోతున్నాడని గతంలో వార్తలొచ్చాయి. వెంకీ కోసం పవర్‌ఫుల్‌ పాత్ర రాశాడని వినిపించింది. అయితే ప్రస్తుతం మరో ఆసక్తికర విషయం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట తరుణ్‌. తారక్‌కు కథ వినిపించాడని, సమాధానం కోసం వేచి చూస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. వెంకీ చిత్రం పూర్తయ్యాక ఎన్టీఆర్‌ని డైరెక్ట్‌ చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో బిజీగా ఉన్నాడు తారక్‌. రాజమౌళి చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాను ఖరారు చేశాడు.

ఇదీ చూడండి.. 'ఉప్పెన' విడుదల వాయిదా.. కొత్త తేదీ అదేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.