ETV Bharat / sitara

RRR Movie: సినిమా విడుదల ఆరోజే ఎందుకు?

author img

By

Published : Jun 29, 2021, 4:03 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్​'(RRR Movie) సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. టాకీ పార్ట్​ పూర్తయ్యిందని చిత్రబృందం ఓ పోస్టర్​ ద్వారా తెలియజేయడం సహా అందులో విడుదల తేదీని గతంలో చెప్పిన (13 అక్టోబరు 2021) దానికే కట్టుబడి ఉంది. దీంతో సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు తీపికబురు చెప్పినట్లైంది. కానీ, ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రంపై అభిమానుల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఓవర్సీస్​ మార్కెట్​ దృష్టిలో ఉంచుకొని చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ​

What is the reason behind RRR movie releasing on October 13?
RRR Movie: సినిమా విడుదల ఆరోజే ఎందుకు?

యావత్‌ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'(RRR Movie) చిత్ర షూటింగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. రెండు పాటలు మినహా షూటింగ్‌(RRR Shooting) మొత్తం పూర్తయినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా మంగళవారం ప్రకటించింది చిత్ర బృందం. అంతేకాదు, ఆ పోస్టర్​(RRR new poster)లో సినిమా విడుదల తేదీ అక్టోబరు 13, 2021గానే చిత్ర బృందం పేర్కొంది. దీంతో ప్రతిష్ఠాత్మక సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు తీపి కబురు చెప్పినట్లైంది. మరి అనుకున్న సమయానికే ఈ సినిమాను తీసుకొస్తారా? కొత్త తేదీని ప్రకటిస్తారా? చూడాలి.

What is the reason behind RRR movie releasing on October 13?
'ఆర్​ఆర్​ఆర్​' సినిమా కొత్త పోస్టర్​

ఆ రోజే ఎందుకంటే..!

'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా షూటింగ్‌ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకూ రెండుసార్లు సినిమా విడుదల వాయిదా పడింది. తొలుత ప్రకటించిన తేదీ ప్రకారం గతేడాది జులై ‌30న సినిమా విడుదల కావాల్సిఉంది. అయితే, ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా కారణంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో సహా అన్ని సినిమాల షూటింగ్‌లు, విడుదల తేదీలు తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఈ చిత్రంలో నటిస్తున్న ఐరిష్‌ నటి అలీసన్‌ డూడీ అక్టోబరు 8న 'ఆర్‌ఆర్‌ఆర్‌' అంటూ పోస్ట్‌ పెట్టి వెంటనే డిలీట్‌ చేసింది. దీంతో సినిమా విడుదల తేదీ దాదాపు ఖరారు అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో చిత్ర బృందం సినిమాను అక్టోబరు 13న(RRR Release Date) విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

What is the reason behind RRR movie releasing on October 13?
కొమురం భీమ్​ ఫస్ట్​లుక్​

'బాహుబలి' తర్వాత రాజమౌళి(Rajamouli RRR) సినిమాలకు అంతర్జాతీయ క్రేజ్‌ ఏర్పడింది. చైనా, జపాన్‌ సహా పలు దేశాల్లో ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో సినిమాను విడుదల చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అలీసన్‌ డూడీ చెప్పినట్లు అక్టోబరు 8న సినిమా విడుదల చేస్తే 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్ర బాండ్‌ 'నో టైమ్‌ టు డై'తో పోటీ పడాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా బాండ్‌ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా విడుదల తేదీని మరో నాలుగు రోజులు పొడిగించారు.

What is the reason behind RRR movie releasing on October 13?
ఉగాది రోజున విడుదల చేసిన పోస్టర్​
What is the reason behind RRR movie releasing on October 13?
షూటింగ్​ సెట్లో రామ్​చరణ్​, తారక్​
What is the reason behind RRR movie releasing on October 13?
షూటింగ్​ సెట్లో రామ్​చరణ్​, తారక్​

ఈ నేపథ్యంలో థియేటర్ల విషయంలో రెండు సినిమాలకు వెసులుబాటు లభించినట్లవుతుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి భారీ ప్రాజెక్టు విడుదల తేదీ ముందుగా ప్రకటించడం కూడా ఒక విధంగా మంచిదే. దసరా సమయానికి మరో చిత్రం పోటీ పడకుండా కాస్త అటూ ఇటూ తేదీలు మార్చుకునే వెసులుబాటు కలుగుతుంది. మిగిలిన సినిమా మేకర్స్‌ కూడా అందుకు అనుగుణంగా షెడ్యూల్స్‌ మార్చుకుంటారు. అంతేకాదు, అప్పటికి కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు పూర్తిస్థాయిలో థియేటర్‌కు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది.

What is the reason behind RRR movie releasing on October 13?
'ఆర్​ఆర్​ఆర్​' రిలీజ్​ తేదీ ప్రకటించినప్పటి పోస్టర్​
What is the reason behind RRR movie releasing on October 13?
ఒలివియా మోరిస్​ బర్త్​డే పోస్టర్​

భారీ అంచనాలు..

జక్కన్న తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై ఇప్పటికైతే భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌(NTR RRR)-రామ్‌చరణ్‌(Ram Charan RRR) కథానాయకులు కావడం వల్ల సినిమాకు సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్‌ కోసం అటు నందమూరి, ఇటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విడుదల తేదీ స్పష్టత లభించడం వల్ల వారి ఆనందం కాస్త రెట్టింపు అయింది.

What is the reason behind RRR movie releasing on October 13?
అజయ్​ దేవగణ్​ బర్త్​డే పోస్టర్​
What is the reason behind RRR movie releasing on October 13?
'ఆర్ఆర్​ఆర్​' సినిమా చిహ్నం
What is the reason behind RRR movie releasing on October 13?
క్లైమాక్స్​ షూటింగ్​లోని దృశ్యం

శాటిలైట్​, డిజిటల్​ హక్కులు

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్‌ మార్కెట్‌ హక్కులు ఇప్పటికే భారీ ధరకు అమ్ముడుపోయాయి. 'ఆర్​ఆర్​ఆర్' సినిమా డిజిటల్, శాటిలైట్​​ హక్కులపై(RRR Satellite Rights) పెన్​ స్టూడియోస్​ ఓ అధికార ప్రకటన చేసింది. వీటిని సొంతం చేసుకున్న పలువురు భాగస్వాముల గురించి ఓ వీడియో ద్వారా వెల్లడించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిజిటల్​ స్ట్రీమింగ్​ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకోగా.. సినిమా హిందీ వర్షెన్​ను నెట్​ఫ్లిక్స్​ కొనుగోలు చేసింది.

What is the reason behind RRR movie releasing on October 13?
ఆలియా భట్​ బర్త్​డే పోస్టర్​

మరోవైపు శాటిలైట్ విభాగంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా హక్కులను స్టార్​ నెట్​వర్క్​ సొంతం చేసుకోగా.. మలయాళంలో ఏసియంట్​, హిందీలో జీ నెట్​వర్క్​ హక్కుదారుగా ఉన్నాయి. ఇతర దేశాల భాషలైన ఇంగ్లీష్​, పోర్చుగీస్​, కొరియన్​, టర్కీష్​, స్పానిష్​లలో నెట్​ఫ్లిక్స్​ డిజిటల్​ వేదికలో ప్రసారం​ చేయనుంది. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ థియేట్రికల్​ హక్కులను పెన్​ మరూధర్​ సినీ ఎంటర్​టైన్మెంట్స్​(RRR Pen Studios​) సొంతం చేసుకుంది.

What is the reason behind RRR movie releasing on October 13?
అల్లూరి సీతారామరాజు ఫస్ట్​లుక్​

ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ ఏడాదే సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడం వల్ల వీఎఫ్‌ఎక్స్‌ పనులకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవైపు ఈ పనులు పూర్తి చేస్తూనే, మరోవైపు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు.

What is the reason behind RRR movie releasing on October 13?
తొలిసారి వాయిదా తర్వాత 'ఆర్​ఆర్​ఆర్​' రెండో విడుదల తేదీ
What is the reason behind RRR movie releasing on October 13?
'ఆర్​ఆర్ఆర్​' దీపావళి పోస్టర్​
What is the reason behind RRR movie releasing on October 13?
దీపావళి రోజున విడుదల చేసిన ఫొటోలు

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా(RRR Cast) రాజమౌళి 'ఆర్‌ఆర్ఆర్‌'ను తెరకెక్కిస్తున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరీస్‌ నాయికలు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించునున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కుమురం భీంగా దర్శనమివ్వనున్నారు.

What is the reason behind RRR movie releasing on October 13?
దసరా శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన 'ఆర్ఆర్ఆర్' పోస్టర్​
What is the reason behind RRR movie releasing on October 13?
షూటింగ్​లో పాల్గొన్న అలియా భట్​(పాత చిత్రం)
What is the reason behind RRR movie releasing on October 13?
రామరాజు ఫర్​ భీమ్​ టీజర్​ పోస్టర్​
What is the reason behind RRR movie releasing on October 13?
భీమ్​ ఫర్​ రామరాజు టీజర్​ రిలీజ్​ పోస్టర్​
What is the reason behind RRR movie releasing on October 13?
'ఆర్​ఆర్ఆర్​' తొలిసారి విడుదల చేస్తామని ప్రకటించిన తేదీ
What is the reason behind RRR movie releasing on October 13?
'ఆర్​ఆర్​ఆర్​' షూటింగ్​ ప్రారంభంలో రామ్​చరణ్​, రాజమౌళి, ఎన్టీఆర్
What is the reason behind RRR movie releasing on October 13?
'ఆర్​ఆర్ఆర్​' షూటింగ్​లో తొలి సన్నివేశపు క్లాప్

ఇదీ చూడండి.. RRR: షూటింగ్​ పూర్తి.. చెప్పిన తేదీకే రిలీజ్​

'ఆర్​ఆర్​ఆర్​' సెట్లో చరణ్​.. 'లూసిఫర్'​ రీమేక్​లో తమన్​

RRR: 'ఆర్​ఆర్​ఆర్' సెట్​లో భీమ్​,రామ్.. చెప్పిన తేదీకే రిలీజ్?

RRR: ఒక్క పాట కోసం నెలరోజులు షూటింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.