ETV Bharat / sitara

విజయ్ సేతుపతి మూకీ సినిమా.. పోస్టర్ రిలీజ్

author img

By

Published : Jan 16, 2021, 4:53 PM IST

Updated : Jan 16, 2021, 5:01 PM IST

విజయ్ సేతుపతి మూకీ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపారు. దీనిని పాన్ ఇండియా కథతో తీస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో థియేటర్లలోకి సినిమా వచ్చే అవకాశముంది.

Vijay Sethupathi to star in silent film Gandhi Talks
విజయ్ సేతుపతి

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు, వెబ్​ సిరీస్​లు చేస్తూ బిజీగా ఉన్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. త్వరలో మూకీ చిత్రంలో ప్రధానపాత్ర పోషించనున్నారు. 'గాంధీ టాక్స్' టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ పోస్టర్​ను ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం విడుదల చేశారు.

Vijay Sethupathi to star in silent film Gandhi Talks
విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్' ఫస్ట్​లుక్ పోస్టర్

ఈ పోస్టర్​లో కరెన్సీ నోట్ల మధ్య ఉన్న విజయ్ సేతుపతి లుక్​ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు కిశోర్ పాండురంగ్ దర్శకుడు. మూవీ మిల్ ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న 'గాంధీ టాక్స్'ను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠా భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 16, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.