ETV Bharat / sitara

బాలీవుడ్​ ప్రముఖ నటి శశికళ మృతి

author img

By

Published : Apr 4, 2021, 5:43 PM IST

బాలీవుడ్​ సీనియర్​ నటి శశికళా ఓమ్​ ప్రకాష్​(88) మృతి చెందారు. 100కు పైగా సినిమాల్లో హీరోయిన్​గా, సహాయనటిగా మెప్పించిన శశికళ.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మృతికి గల కారణాలేవి తెలిసిరాలేదు.

Veteran actor Shashikala Om Prakash Saigal passes away at 88
బాలీవుడ్​ ప్రముఖ నటి శశికళ మృతి

ప్రముఖ నటి శశికళా ఓమ్​ ప్రకాష్​ సైగల్​(88) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులతో పాటు రచయిత కిరణ్​ కోట్రియల్ సోషల్​మీడియాలో​ పంచుకున్నారు. అయితే ఆమె మృతికి గల కారణాలేవి తెలిసిరాలేదు.

మహారాష్ట్రలోని సోలాపూర్​లో జన్మించిన శశికళ.. 'కరోడ్​పతి' సినిమాతో బాలీవుడ్​లో అరంగేట్రం చేశారు. 100కు పైగా సినిమాల్లో హీరోయిన్​ సహా సహాయ పాత్రలతో నటించి మెప్పించారు. ఓమ్ ప్రకాష్​ సైగల్​ను శశికళ వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం.

ఇదీ చూడండి: బాలీవుడ్​ ప్రముఖ నటుడు గోవిందకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.