ETV Bharat / sitara

వెంకటేశ్ ఆ పాత్రలో.. 1992 తర్వాత మళ్లీ అలా!

author img

By

Published : Oct 29, 2020, 1:37 PM IST

విక్టరీ వెంకటేశ్.. కాలేజీకి వెళ్లి మరోసారి పాఠాలు చెప్పబోతున్నారట. తరుణ్ భాస్కర్​ తీయబోయే కొత్త సినిమా కోసమే వెంకీ ఇలా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Venkatesh Is Going To Act As Lecturer In Tarun Bhaskar Movie
లెక్చరర్​గా వెంకటేశ్.. 1992 తర్వాత మళ్లీ ఇప్పుడే!

వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరించే కథానాయకుడు వెంకటేశ్.. మరోసారి అలానే సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్​తో చేయబోయే సినిమాలో వెంకీ లెక్చరర్​గా కనిపించనున్నారని సమాచారం. సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

1992లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'సుందరకాండ'లో లెక్చరర్​గా చేసి ఆకట్టుకున్నారు వెంకటేశ్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి గెటప్​లోనే దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం గురించి పూర్తివివరాలు వెల్లడించే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.