ETV Bharat / sitara

మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు: వరుణ్​

author img

By

Published : Jan 27, 2021, 4:05 PM IST

స్టార్ హీరో వరుణ్​ ధావన్​ తన పెళ్లి గురించి ట్విట్టర్​లో స్పందించారు. వివాహం సందర్భంగా తమ జంటపై ప్రేమ కురిపిస్తూ.. శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Varun Dhawan expresses gratitude to 'everyone' post marriage with Natasha Dalal
మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు: వరుణ్​

బాలీవుడ్​ హీరో వరుణ్​ ధావన్​.. తన స్నేహితురాలైన నటాషా దలాల్​ను గత ఆదివారం పెళ్లి చేసుకున్నారు. వివాహం సందర్భంగా తమ జంటపై ప్రేమ కురిపిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ సోషల్​మీడియాలో వరుణ్​ ధన్యవాదాలు తెలిపారు.

"గత కొన్ని రోజులుగా నాతో పాటు నటాషాపై ప్రేమాభిమానాలు కురిపిస్తూ.. శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు."

- వరుణ్ ధావన్​, బాలీవుడ్​ నటుడు

అలీబాగ్​లోని మాన్సస్ హౌస్ రిసార్ట్​లో జరిగిన ఈ వివాహ వేడుకలో ప్రేయసి నటాషా దలాల్​ మెడలో వరుణ్​ ధావన్​ మూడు ముళ్లు వేశారు. ఇరుకుటుంబాలతో పాటు సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు బాలీవుడ్​ సెలబ్రిటీలు దంపతులకు సోషల్​మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: అంగరంగ వైభవంగా హీరో వరుణ్ పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.