ETV Bharat / sitara

2021 మాములుగా ఉండదు.. సినిమాలే సినిమాలు

author img

By

Published : Dec 30, 2020, 9:01 AM IST

కరోనా ఈ ఏడాది మొత్తంగా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే కొత్త సంవత్సరం అద్భుతమైన సినిమాలతో మీ కోసం ఎదురుచూస్తోంది. మరెందుకు ఆలస్యం.. థియేటర్లలో వాటిని చూసేందుకు సిద్ధమవ్వండి.

upcoming movies of 2021 release in theaters
2021 మాములుగా ఉండదు.. సినిమాలే సినిమాలు

'తింటే గారెలు తినాలి.. వింటే మహాభారతం వినాలి'.. అలానే సినిమా అంటూ చూస్తే థియేటర్​లోనే చూడాలి. కానీ కరోనా లాక్​డౌన్..​ ఆ అనుభూతిని దాదాపు తొమ్మిది నెలలు మనకు దూరం చేసింది.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. వచ్చే జనాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే బడా, చిన్న చిత్రాలు కొన్ని.. వచ్చే ఏడాది మనల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో అగ్రహీరోలతో పాటు యువ హీరోల సినిమాలూ ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

upcoming movies of 2021 release in theaters
థియేటర్​లో సినిమాలు విడుదల

స్టార్​ హీరోలు.. భారీ చిత్రాలు

ఈ ఏడాది వెండితెరపై విడుదల కావాల్సిన చాలా చిత్రాలు లాక్​డౌన్ వల్ల రిలీజ్​కు నోచుకోలేదు. షూటింగ్​ నిలిచిపోవడం, థియేటర్లు తెరుచుకోకపోవడం వల్లే ఇలా జరిగింది.

ఈ జాబితాలో చిరంజీవి 'ఆచార్య', పవన్​ కల్యాణ్ 'వకీల్​సాబ్', వెంకటేశ్ 'నారప్ప', బాలకృష్ణ-బోయపాటి సినిమా, నాగార్జున 'వైల్డ్​డాగ్', రామ్​చరణ్-జూ.ఎన్టీఆర్​ 'ఆర్ఆర్ఆర్', అల్లు అర్జున్ 'పుష్ప', ప్రభాస్ 'రాధేశ్యామ్', రవితేజ 'క్రాక్'తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి.

upcoming movies of 2021 release in theaters
థియేటర్​ దగ్గర అభిమానులు సందడి

దూకుడు మీదున్న చిన్న హీరోలు

భారీ బడ్జెట్​ సినిమాలతో పాటు చిన్న హీరోలు కూడా తమ చిత్రాలను కొత్త ఏడాదిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో నాని, రామ్, విజయ్ దేవరకొండ, నిఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్, వరుణ్ తేజ్​ తదితరుల చిత్రాలు ఉన్నాయి. కొందరు కథానాయకులు నటించిన రెండు, మూడు సినిమాలు 2021లో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.