ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్' హీరోల ఫస్ట్​లుక్స్​ వచ్చేది అప్పుడే..!

author img

By

Published : Feb 13, 2020, 6:43 AM IST

Updated : Mar 1, 2020, 4:06 AM IST

'ఆర్​ఆర్​ఆర్​'.. ఇద్దరు అగ్రహీరోలతో తెరకెక్కుతోన్న భారీ చిత్రం. దీనికి సంబంధించిన అప్​డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. 'ఆర్​ఆర్​ఆర్​'లో రామ్​చరణ్​, జూనియర్ ఎన్టీఆర్​ ఫస్ట్​లుక్స్​ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని వేచి చూస్తున్నారు. తాజాగా ఈ హీరోల ఫస్ట్​లుక్​ విడుదల తేదీలను ఖరారు చేసిందట చిత్ర బృందం.

There was a lot of news about this film and the fans are eagerly anticipating for the film's first look to be released
'ఆర్​ఆర్​ఆర్' ఫస్ట్​లుక్స్​ వచ్చేది అప్పుడే..!

'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలోని రామ్‌ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్స్‌ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ ఇద్దరితో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రమిది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవిత కథలను స్ఫూర్తిగా తీసుకుని రూపొందిస్తున్న సినిమా కావడం వల్ల అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అల్లూరిగా చెర్రీ, భీమ్​గా తారక్‌ కనిపించనున్నారు. వీరు సినిమాలో ఎలా ఉంటారో అని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో సందేహం మొదలైంది. చిత్రీకరణ దాదాపు 70శాతం పూర్తైనా ఇప్పటివరకు ఫస్ట్‌లుక్స్‌ విడుదల చేయలేదు. అయితే వీరిద్దరి ఫస్ట్​లుక్స్ త్వరలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

There was a lot of news about this film and the fans are eagerly anticipating for the film's first look to be released
'ఆర్​ఆర్​ఆర్' ఫస్ట్​లుక్స్​ వచ్చేది అప్పుడే..!

ఇంతకాలం వేచి చూసిన అభిమానులు పండగ చేసుకునేలా చెర్రీ, తారక్‌ లుక్స్‌ సిద్ధం చేస్తుందట చిత్రబృందం. ఈ ఇద్దరి నాయకుల పుట్టిన రోజు సందర్భంగా వారి లుక్స్‌ రిలీజ్‌ చేయనున్నారట. మార్చి 27న అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, మే 20న కొమురం భీమ్​గా తారక్‌ దర్శనమివ్వనున్నారని ప్రచారం సాగుతుంది. కొన్ని రోజుల్లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' బృందం నుంచి ఈ విషయం అధికారికంగా వినిపించనుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, అలియా భట్‌ నాయికలు. 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

There was a lot of news about this film and the fans are eagerly anticipating for the film's first look to be released
'ఆర్​ఆర్​ఆర్' ఫస్ట్​లుక్స్​ వచ్చేది అప్పుడే..!

ఇదీ చదవండి: 'సింగిల్ కింగులం.. మేమే గబ్బర్ సింగులం'

Last Updated : Mar 1, 2020, 4:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.