ETV Bharat / sitara

Chiranjeevi: చిరంజీవి కోసం చరణ్​ స్పెషల్ సాంగ్

author img

By

Published : Jun 13, 2021, 2:26 PM IST

special song on megastar chiranjeevi by charan
చిరంజీవి చరణ్

మెగాస్టార్ చిరంజీవి, ఈ మధ్యలో కాలంలో తనవంతు సేవాగుణాన్ని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో గాయకుడు చరణ్​ ఆయన గురించి ఓ ప్రత్యేక గీతాన్నిపాడారు.

చిరు ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో భాగంగా బ్లడ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌తోపాటు ఇటీవల ఆక్సిజన్‌ బ్యాంకులను ఏర్పాటు చేసి మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ సంగీత దర్శకుడు, గాయకుడు చరణ్‌ అర్జున్‌ ఓ ప్రత్యేక గీతాన్ని అలపించారు.

'ఎవరన్నారు నువ్వు చిరంజీవని.. ఇప్పుడు నువ్వే మా సంజీవని' అంటూ సాగే ఈ పాటను చరణ్‌ అర్జున్‌, నాగదుర్గ ఆలపించారు. ప్రముఖ దర్శకుడు మెహర్‌ రమేశ్‌ ఈ పాటను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. నటుడిగా కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ చిరంజీవి.. తన జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాల గురించి ఈ పాట ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. మరోవైపు చరణ్‌.. ఇటీవల సోనూసూద్‌పై ఓ స్పెషల్‌ సాంగ్‌ అలపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.