ETV Bharat / sitara

సిద్​ శ్రీరామ్​ హీరోగా మణిరత్నం సినిమా!

author img

By

Published : Jan 10, 2022, 8:49 AM IST

SidSriram Maniratnam direction: యువ గాయకుడు సిద్​ శ్రీరామ్​ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మణిరత్నం రూపొందిస్తారని సమాచారం.

Singer sid sriram as hero in Maniratnam direction
హీరోగా సిద్​ శ్రీరామ్​

SidSriram Maniratnam direction: చిత్రసీమలో యువ గాయకుడు సిద్‌ శ్రీరామ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఆయన పాడిన ప్రతి పాట ఓ సెన్సేషనే. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ దక్కించుకుంటూ.. ఆయా చిత్రాలకు కావాల్సినంత ప్రచారం కల్పిస్తున్నాయి.

ముఖ్యంగా శ్రీరామ్​ ఆలపించే మెలోడీ గీతాలకు యువతరంలో మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడీ యువ గాయకుడు హీరోగా కొత్త అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'కడలి' సినిమాతో సిద్‌ శ్రీరామ్‌ గాయకుడిగా తెరకు పరిచయమమ్యారు. ఇప్పుడాయన చిత్రంతోనే సిద్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్‌ నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడం వల్ల హీరోగా నటించేందుకు అంగీకరించినట్లు ప్రచారం వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం చేస్తారా? లేక నిర్మాతగా వ్యవహరించనున్నారా? అన్నది తేలాల్సి ఉంది.

ఇదీ చూడండి: రెడ్​ డ్రెస్​లో ఘాటుగా పూనమ్.. మౌనీ రాయ్​ హొయలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.