ETV Bharat / sitara

'శిల్పాశెట్టికి క్లీన్ చిట్ రాలేదు.. విచారణ కొనసాగుతోంది'

author img

By

Published : Jul 27, 2021, 6:58 PM IST

Shilpa Shetty
శిల్పాశెట్టి

అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో విచారణను ముమ్మరం చేశారు ముంబయి క్రైమ్ బ్రాంచ్ అధికారులు. మంగళవారం వ్యాపారవేత్త రాజ్​కుంద్రాకు 14రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అలాగే ఈ కేసులో శిల్పాశెట్టికి ఇప్పటివరకు క్లీన్ చిట్ లభించలేదని అధికారులు వెల్లడించారు.

అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం వ్యాపారవేత్త రాజ్​కుంద్రాకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. దీంతో అతడి నుంచి పోలీసులు మరింత సమాచారం సేకరించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే కుంద్రా సతీమణి, ప్రముఖ బాలీవుడ్​ నటి శిల్పాశెట్టికి ఈ కేసు విషయంలో ఇంకా క్లీన్ చిట్ లభించలేదని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

"ఈ కేసులో శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ లభించలేదు. ఫోరెన్సిక్ ఆడిటర్లు బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. హాట్​షాట్ యాప్​ ప్రదీప్(కుంద్రా బావమరిది) పేరు మీదే ఉన్నా.. దీని మొత్తం వ్యవహారాన్ని రాజ్​కుంద్రానే చూస్తున్నారు. కుంద్రా అరెస్టు తర్వాత పలువురు మా వద్దకు వచ్చి స్టేట్​మెంట్ ఇచ్చారు. ఈ కేసు విషయంలో రూ.6 కోట్ల విలువ గల అరవింద్ శ్రీవాత్సవ్​ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలను నిలిపివేశాం. తన ఖాతాలను అతడు పునరుద్ధరించాలని కోరినా.. మొదట పోలీసులు ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించాం. అలాగే నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు పంపించాం."

-ముంబయి క్రైమ్ బ్రాంచ్ అధికారి

అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో అరెస్టయిన నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అశ్లీల చిత్రాలను నిర్మించి.. వాటిని పలు యాప్‌లకు విక్రయిస్తున్నాడనే కేసులో రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు ఈనెల 19న అరెస్టు చేశారు. కాగా రాజ్‌కుంద్రా పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. ఈనేపథ్యంలోనే.. విచారణ ముగిసిందని, తన క్లయింట్‌కు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా రాజ్‌కుంద్రా తరఫు లాయర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. కాగా ఆ పిటిషన్‌ను ముంబయి కోర్టు కొట్టివేస్తూ.. రాజ్‌కుంద్రాకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

ఇవీ చూడండి: చీకటి వ్యాపారంపై రాజ్​ కుంద్రాను నిలదీసిన శిల్పా శెట్టి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.