ETV Bharat / sitara

'జెర్సీ' కోసం షాహిద్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

author img

By

Published : Sep 24, 2020, 10:44 AM IST

తెలుగు సూపర్ హిట్ మూవీ 'జెర్సీ'ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరో. మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అయితే ఈ చిత్రం కోసం షాహిద్ భారీ పారితోషికం తీసుకుంటున్నాడట.

Shahid Kapoor taking huge amount for jersey
షాహిద్

తెలుగులో సూపర్‌హిట్‌ అందుకున్న 'జెర్సీ'ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. మాతృకను తీసిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. గతేడాది డిసెంబరులో షూటింగ్‌ ఆరంభమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా కోసం షాహిద్‌ రూ.35 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడట. అంతేకాదు సినిమాకు వచ్చే లాభంలో 20 శాతం వాటా కూడా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గత సినిమా విజయం సాధించిన నేపథ్యంలో అతడు పారితోషికం పెంచినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.

ఇప్పటికే షాహిద్‌ తెలుగు సినిమా 'అర్జున్‌ రెడ్డి' హిందీ రీమేక్‌లో నటించాడు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయికగా కనిపించింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం రూ.379 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. అంతేకాదు షాహిద్‌, కియారా నటనకు సినీ ప్రముఖులతోపాటు నెటిజన్ల ప్రశంసలు లభించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.