ETV Bharat / sitara

'ఫ్యామిలీ మ్యాన్ 2'​కు డబ్బింగ్ చెబుతోన్న సమంత!

author img

By

Published : Aug 28, 2020, 10:52 AM IST

'ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​తో తొలిసారి డిజిటల్​ ప్లాట్​ఫామ్​పై అలరించనుంది సమంత.. ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్​ చెబుతున్న ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​లో పోస్ట్​ చేసింది.

Samantha Akkineni
సమంత

అందం, ఆకట్టుకునే అభినయంతో ఇన్నాళ్లు వెండితెరపై సందడి చేసిన సమంత.. ఇప్పుడు 'ఫ్యామిలీ మ్యాన్​‌ 2' సిరీస్‌తో తొలిసారి ఓటీటీ మాధ్యమాలపై కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్​ ప్రైమ్​ డిజిటల్​ ప్లాట్​ఫామ్​ నిర్మిస్తున్న ఈ సిరీస్​.. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్​ చెప్పేందుకు సమంత సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకుంది.

Samantha Akkineni
సమంత పోస్ట్​

ఈ సిరీస్​తో సమంత తొలిసారి డిజిటల్​ వేదికు పరిచయమౌతోంది. మనోజ్ బాజ్​పేయ్, ప్రియమణి, నీరజ్ మాధవ్, గుల్​ పనాగ్​లు కీలక పాత్ర పోషించారు. రాజ్​ నిడిమోరు, డీకె కృష్ణ దర్శకులు. సిరీస్ విడుదల తేదీపై ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.