ETV Bharat / sitara

చైతూ.. నువ్వు నా వాడివి: సమంత

author img

By

Published : Oct 6, 2020, 5:51 PM IST

నాగ చైతన్యపై ఉన్న ప్రేమను తెలియజేశారు ఆయన భార్య సమంత. ఈరోజు వీరి పెళ్లిరోజు సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు సామ్.

Samantha adorable anniversary wishes to Naga Chaitanya
చైతూ.. నువ్వు నా వాడివి: సమంత

'చైతన్య నువ్వు నా వాడివి.. నేను నీ దాన్ని..' అంటూ ఆయనపై ఉన్న ప్రేమను తెలిపారు కథానాయిక సమంత. వీరిద్దరు ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన రోజు ఇది. ఈ సందర్భంగా సమంత తన ప్రియమైన భర్తకు ప్రేమ సందేశం పంపారు.

"నువ్వు నా వాడివి.. నేను నీ దాన్ని. మనం ఏ ద్వారాల దగ్గరికి చేరుకున్నా.. కలిసే వాటిని తెరుద్దాం (కష్టసుఖాల్ని ఉద్దేశిస్తూ). నా శ్రీవారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు సామ్.

రానా వివాహం సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు సామ్. "వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీకు నా ప్రేమను పంపుతున్నా" అని ఉపాసన కామెంట్‌ చేశారు. "ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండండి" అని రానా పేర్కొన్నారు. వెన్నెల కిశోర్‌, ప్రియమణి, ప్రగ్యా జైశ్వాల్‌, మంచు లక్ష్మీ, కోన నీరజ, రాశీ ఖన్నా, కృతి కర్బందా, చిన్మయి, విమల రామణ్‌ తదితరులు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.

'జాను' తర్వాత సమంత 'ది ఫ్యామిలీ మెన్‌' అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో ఇది త్వరలోనే విడుదల కాబోతోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామ్‌ కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక శిక్షణ తీసుకుని ఆహారం వండటం నేర్చుకున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఉపాసనతో కలిసి 'యువర్‌లైఫ్‌' అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. అంతేకాదు 'సాకి' అనే దుస్తుల బ్రాండ్‌ను కూడా ఇటీవల ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.