ETV Bharat / sitara

షారుక్​ 'పఠాన్' చిత్రీకరణలో సల్మాన్​!

author img

By

Published : Dec 14, 2020, 1:30 PM IST

Updated : Dec 14, 2020, 2:05 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్ ఖాన్ నటిస్తోన్న 'పఠాన్'​ సినిమాలో​ సల్మాన్​ ఖాన్​, హృతిక్​ రోషన్​ అతిథి పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే సల్మాన్​ చిత్రీకరణ కోసం దుబాయ్​ కూడా వెళ్లారని సమాచారం. ఈ చిత్రానికి సిద్దార్థ్​ ఆనంద్​ దర్శకత్వం వహిస్తున్నారు.

Salman Khan to shoot for SRK's Pathan in Dubai?
షారుక్​

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్​ నటిస్తోన్న సినిమా 'పఠాన్'. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. యాక్షన్​ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో సల్మాన్​ ఖాన్​ నటించనున్నట్లు కొద్దికాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు సల్మాన్​ దుబాయ్ వెళ్లారని తెలిసింది. 'ఏక్తా టైగర్'​ సినిమాలో ఆయన పోషించిన 'రా' ఏజెంట్ అవినాష్​ సింగ్​ రాథోడ్ ​పాత్రతోనే 'పఠాన్'​ సినిమాలోనూ కనిపించనున్నారని వినికిడి. ఆయన పాత్ర నిడివి 15 నిమిషాల పాటు ఉండనుందట.

కాగా, హీరో హృతిక్​రోషన్ కూడా ఈ సినిమాలో కనువిందు చేయనున్నట్లు సమాచారం. 'వార్'​ చిత్రంలో తాను నటించిన కబీర్​ పాత్రతోనే షారుక్​ సినిమాలో అలరించనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

'వార్‌'తో హిట్​ కొట్టిన సిద్ధార్థ్‌ ఆనంద్.. 'పఠాన్'​ చిత్రానికి దర్శకుడు. ‌దీపికా పదుకొణె హీరోయిన్. జాన్‌ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్​‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదీ చూడండి : 881 రోజుల తర్వాత.. చిత్రీకరణలో పాల్గొన్న షారుక్​!​

Last Updated : Dec 14, 2020, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.