ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్​' ఉగాది సర్​ప్రైజ్ వచ్చేసింది​!

author img

By

Published : Apr 13, 2021, 10:03 AM IST

Updated : Apr 13, 2021, 10:15 AM IST

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, తారక్ హీరోలుగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఉగాది పండగ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

RRR team released a poster on the Occasion of Ugadi Festivel
'ఆర్​ఆర్​ఆర్​' ఉగాది సర్​ప్రైజ్ వచ్చేసింది​!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్​ఆర్'​ సినిమా నుంచి ఉగాది పండగ సందర్భంగా ఓ పోస్టర్​ విడుదలైంది. ఇందులో రామ్​చరణ్​, ఎన్టీఆర్​లను తమ చేతులపై ఎత్తుకొని కొందరు గాల్లోకి లేపుతూ సందడి చేస్తున్నారు. ఇందులో చెర్రీ, తారక్​ లుక్​ ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ సరసన ఒలివియా మోరిస్​, అలియా భట్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 13న విడుదల కానుందీ సినిమా. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

ఇదీ చూడండి: టాలీవుడ్​లో వాట్సప్​ వాడని దర్శకుడెవరో తెలుసా?

Last Updated : Apr 13, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.