ETV Bharat / sitara

భయపెడుతున్న జాన్వీ- 'షాదీ ముబారక్'​ టీజర్​ రిలీజ్​

author img

By

Published : Feb 16, 2021, 3:51 PM IST

Updated : Feb 16, 2021, 4:55 PM IST

కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చేశాయి. రాజ్‌కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం 'రూహీ', 'మొగలిరేకులు' సీరియల్​ ఫేం సాగర్ నటించిన 'షాదీ ముబారక్', 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమా టీజర్​లు​ ఉన్నాయి. అవన్నీ చూసేద్దాం.

roohi
రూహీ

బాలీవుడ్​ నటులు రాజ్‌కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం 'రూహీ' టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. రాజ్​కుమార్​ కామెడీ, దెయ్యం గెటప్​లో జాన్వీ నటనతో ఈ టీజర్​​ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి హార్దిక్​ మెహ్తా దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రముఖ సీరియల్​ 'మొగలిరేకులు' ఫేం సాగర్​(ఆర్​.కె.నాయుడు) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'షాదీ ముబారక్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా క‌థ ఇంటి పేరు చుట్టూ తిరుగుతూ కామెడీ నేపథ్యంలో రూపొందింది. దృశ్య ర‌ఘునాథ్‌ కథానాయిక. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆశిష్​ శ్రీవాస్తవ్​ దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమా టీజర్​ విడుదలైంది. రొమాంటిక్​ నేపథ్యంలో తెరకెక్కిందీ చిత్రం. ఈ చిత్రానికి యుగంధర్​ దర్శకత్వం వహించగా.. చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. పూజా రామచంద్రన్, తనికెళ్ల భరణి, తులసి,రాజారవీంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యువ కథానాయకుడు శ్రీ విష్ణు హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఓ వారాహి చలన చిత్రం ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'భళా తందనాన' అనే పేరు ఖరారు చేశారు. కేథరిన్‌ నాయిక. చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందనుంది. హైదరాబాద్‌లో మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పురాణాపండ శ్రీనివాస్‌ క్లాప్‌ కొట్టగా.. దర్శకుడు రాజమౌళి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. వల్లి, రమ చిత్రబందానికి స్క్రిప్టుని అందజేశారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవనుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.

raja
భళా తందనాన

విభిన్న కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ అభిమానులను అలరిస్తున్న మలయాళ డైరెక్టర్‌ మిథున్‌ మాన్యువల్ థామస్. ఆయన దర్శకత్వంలో గతేడాది వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంజామ్ పథిరా’ థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు 'మిడ్‌నైట్‌ మర్డర్స్‌' పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కుంచకో బోబన్, షరాఫ్‌యుద్దీన్‌, ఉన్నిమయ, ఇంద్రాన్స్, శ్రీనాథ్ బసి, రమ్య నంబీసన్, జీను జోసెఫ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సుశీన్‌శ్యామ్‌ సంగీతం అందించారు. ఆషిక్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఈ చిత్రం ప్రముఖ డిజిటల్‌ ఓటీటీ వేదిక 'ఆహా'లో ఫిబ్రవరి 19 నుంచి ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అతిథి పాత్రలకు సై అంటోన్న స్టార్ హీరోలు!

Last Updated : Feb 16, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.