ETV Bharat / sitara

బిగ్​బాస్​ సెట్​ సీజ్​ చేసిన పోలీసులు

author img

By

Published : May 20, 2021, 12:56 PM IST

కరోనా ప్రొటోకాల్స్​ను ఉల్లంఘించి చిత్రీకరణ జరిపినందుకు మలయాళ బిగ్​బాస్ సీజన్​ 3 షూటింగ్​ను నిలిపివేశారు పోలీసు అధికారులు. చెన్నైలో ఈ కార్యక్రమం కోసం వేసిన షూటింగ్​ సెట్​ను సీజ్​ చేశారు.

bigboss
బిగ్​బాస్​

మెగాస్టార్​ మోహన్​లాల్​ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మలయాళ బిగ్​బాస్ సీజన్​ 3 ​షూటింగ్​ను తమిళనాడు పోలీసు అధికారులు నిలిపివేశారు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్​సిటీలో ఈ షో కోసం వేసిన షూటింగ్​ సెట్​ను సీజ్​ చేశారు. కరోనా ఆంక్షల్ని ఉల్లంఘించి చిత్రీకరణ జరపడమే ఇందుకు కారణం.

కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో మే 31వరకు చిత్రీకరణలను నిలిపివేయాలని ఆదేశించింది ఫిల్మ్​ ఎంప్లాయిస్​ ఫెడరేషన్​ ఆఫ్​ సౌత్​ ఇండియా(ఎఫ్​ఈఎఫ్​ఎస్​ఐ). అయితే ఈ ప్రొటోకాల్స్​ను ఉల్లంఘించి ఈ షో షూటింగ్​ను జరిపారు. ఇది తెలుసుకున్న అధికారులు షూటింగ్​ సెట్​ను సీజ్​ చేశారు. కంటెస్టులను ఓ హోటల్​కు తరలించారు. గత వారమే ఈ షోకు సంబంధించిన ఆరుగురు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పరిస్థితి సద్దుమణిగాక ఈ కార్యక్రమం చిత్రీకరణను పునఃప్రారంభిస్తామని ప్రకటించారు ఈ షో నిర్వాహకులు.

ఇదీ చూడండి: గులాబీ డ్రెస్స్​లో బిగ్​బాస్​ బ్యూటీ పోజులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.