ETV Bharat / sitara

ప్రముఖ నిర్మాత, హీరోయిన్​ తండ్రి కన్నుమూత

author img

By

Published : Feb 11, 2022, 3:22 PM IST

Updated : Feb 11, 2022, 3:52 PM IST

Raveena Tandon Father died: ప్రముఖ బాలీవుడ్​ నటి రవీనా టాండన్​ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి, నిర్మాత రవి టాండన్​ వృద్దాప్య సమస్యల వల్ల తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Raveena Tandon Father died
రవీనా టాండన్​ తండ్రి మృతి

Raveena Tandon Father died: ప్రముఖ నటి రవీనా టాండన్​ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి, నిర్మాత రవి టాండన్(86) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యల వల్ల శుక్రవారం ఉదయం ముంబయిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇన్​స్టాలో తెలుపుతూ.. తన తండ్రితో కలిసి దిగిన ఫొటోలను రవీనా పోస్ట్​ చేసింది. 'మీరెప్పుడు నాతోనే ఉంటారు. నేను కూడా మీతోనే ఉంటాను. లవ్​ యు నాన్న' అని భావోద్వేగ వ్యాఖ్య రాసుకొచ్చింది.

రవి టాండన్​ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, రవీనా టాండన్​ త్వరలోనే 'కేజీఎఫ్​ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదీ చూడండి: రణ్​బీర్​తో నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: ఆలియా భట్

Last Updated : Feb 11, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.