ETV Bharat / sitara

ఆ ఛాన్స్ రావడం చాలా అరుదు: హీరోయిన్ రాణీ ముఖర్జీ

author img

By

Published : Nov 18, 2021, 7:25 AM IST

'బంటీ ఔర్ బబ్లీ 2' రిలీజ్ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పింది హీరోయిన్ రాణీ ముఖర్జీ. ఒకప్పుడు పోషించిన పాత్రలో మళ్లీ నటించడం తనకు దక్కిన అదృష్టమని తెలిపింది.

rani mukerji
రాణీ ముఖర్జీ

"ఓ సినిమా విడుదలవుతుందంటే సీనియర్‌ నటుడికైనా, కొత్తవాళ్లకైనా ఆత్రుతగానే ఉంటుంది" అని సీనియర్‌ కథానాయిక రాణీ ముఖర్జీ అంటోంది. 'మర్దానీ 2' విజయం తర్వాత ఆమె నటించిన చిత్రం 'బంటీ ఔర్‌ బబ్లీ 2'. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, శర్వరి ఇతర కీలక పాత్రల్లో నటించారు. వరుణ్‌.వి.శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ పంచుకున్న సంగతులు..

rani mukerji
రాణీ ముఖర్జీ

* 'బంటీ ఔర్‌ బబ్లీ'కి పదిహేనేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్‌ ఇది. అప్పట్లోనే కొనసాగింపు తీయాలని అనుకున్నారు, కుదర్లేదు. నిర్మాత ఆదిత్య చోప్రా మనసులో ఉన్న కథను వరుణ్‌ అద్భుతంగా తెరకెక్కించారు. అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందీ చిత్రం. యువ జంటగా సిద్ధాంత్‌ చతుర్వేది, శర్వరీల నటన చాలా క్యూట్‌గా ఉంటుంది. అప్పుడు బబ్లీ పాత్రలో నటించే నాటికి నాకు ఎలాంటి బాధ్యతలు లేవు. ఇప్పుడు నేను ఓ తల్లిని. నా జీవితంలో వచ్చినట్టే బబ్లీ పాత్ర పరంగానూ చాలా మార్పులుంటాయి.

* ఒకప్పుడు పోషించిన పాత్రల్ని ఇన్నేళ్ల తర్వాత కొత్తగా మళ్లీ నటించే అవకాశం చాలా అరుదు. నాకు ఆ అదృష్టం దక్కింది. ప్రేక్షకుల ప్రశంసలే మాకు బలం. సినిమా చూసి మన పాత్రను గొప్పగా పొగడాలి, థియేటర్లు చప్పట్లతో మార్మోగాలి అనుకోవడం దురాశే కావచ్చు. కానీ అది లేకపోతే నటులు మరింత ఉత్సాహంగా ముందుకెళ్లలేరు.

* భారతీయ మహిళల గొప్పతనాన్ని చాటిచెప్పే పాత్రల్లో నటించడం అంటే నాకు చాలా ఇష్టం. 'బబ్లీ', 'శివాని శివాజీ రాయ్‌', 'నైనా మాథుర్‌'.. ఇలా నేను పోషించిన పాత్రలు మహిళల సత్తా ఏంటో చెప్పిన చిత్రాలు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.