ETV Bharat / sitara

రణ్​బీర్-ఆలియా నిశ్చితార్థం రాజస్థాన్​లో?

author img

By

Published : Dec 30, 2020, 11:39 AM IST

Updated : Dec 30, 2020, 12:14 PM IST

రణ్​బీర్-ఆలియా బంధం ఇకపై అధికారికం కానుంది. రాజస్థాన్​లోని ఓ విలాసవంతమైన హోటల్లో వీరి నిశ్చితార్థం, మరికొన్ని గంటల్లో జరగనుంది. ప్రస్తుతం ఇరు కుటుంబాల సభ్యులు అక్కడే ఉన్నారు.

Ranbir Kapoor and Alia Bhatt getting engaged in Ranthambore?
రణ్​బీర్-ఆలియా నిశ్చితార్థం రాజస్థాన్​లో?

బాలీవుడ్​ లవ్​బర్డ్స్ రణ్​బీర్ కపూర్-ఆలియా భట్.. ఈ ఏడాదిని శుభవార్తతో వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. వీరి నిశ్చితార్థం రాజస్థాన్​లో బుధవారం లేదా గురువారం జరగనున్నట్లు తెలుస్తోంది.

Ranbir Kapoor and Alia Bhatt getting engaged
రణ్​బీర్-ఆలియా

ఇప్పటికే కపూర్, భట్​ కుటుంబ సభ్యులతో పాటు రణ్​వీర్-దీపిక కూడా రాజస్థాన్​లోని రణ్​తంబోరే చేరుకోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం వీరిందరూ ఆ ఊరిలోనే ఓ విలాసవంతమైన హోటల్​లో బస్ చేస్తున్నారని, అందులోనే రణ్​బీర్-ఆలియా ఎంగేజ్​మెంట్​ వేడుక జరగనుందని తెలుస్తోంది.

ఇందుకు తగ్గట్లుగానే రణ్​బీర్​ తల్లి నీతూ కపూర్.. తన కుమారుడితో పాటు రణ్​వీర్ సింగ్​తో దిగిన ఫొటోను ఇన్​స్టా స్టోరీలో పెట్టారు. దీంతో రణ్​బీర్-ఆలియా నిశ్చితార్థం జరగడం కచ్చితమని అభిమానులు ఫిక్సయిపోయారు.

neetu kapoor ranbir alia engagement
నీతూ కపూర్​ ఇన్​స్టా స్టోరీస్​లో పెట్టిన ఫొటో

ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రణ్​బీర్ కపూర్.. త్వరలో జీవితంలో మరో అడుగు వేస్తానని చెప్పాడు. ప్రస్తుతం రణ్​బీర్, ఆలియాతో 'బ్రహ్మస్త్ర' సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో అది విడుదలయ్యే అవకాశముంది.

Last Updated : Dec 30, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.