ETV Bharat / sitara

లవ్​బర్డ్స్​ రణ్​బీర్-ఆలియా​ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా?

author img

By

Published : Nov 10, 2021, 11:36 AM IST

బాలీవుడ్​ ప్రేమజంట రణ్​బీర్​-ఆలియా భట్​(ranbir alia bhatt marriage)​ ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడా వివాహ వేడుకను వచ్చే ఏడాదికి వాయిదా వేశారని తెలిసింది.

alia
ఆలియా-రణ్​బీర్​

బాలీవుడ్​ లవ్​బర్డ్స్ రణ్​బీర్ కపూర్-ఆలియా భట్​(ranbir alia bhatt marriage) ఈ ఏడాది కూడా పెళ్లి చేసుకునే సూచనలు కనపడట్లేదు. వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుంటారని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడా వేడుక వాయిదా పడినట్లు తెలిసింది. రణ్​బీర్​-ఆలియా తమ వెడ్డింగ్​ ప్లాన్​ను మార్చుకున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్​లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీటౌన్​ మీడియాలో వార్తలొస్తున్నాయి. షూటింగ్​ల్లో బిజీగా ఉండటమే కారణమని తెలిసింది. వీరిద్దరూ తమ పెళ్లిని కోహ్లీ-అనుష్క తరహాలోనే ఇటలీలో చేసుకుంటారని సమాచారం.

దాదాపు మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు రణ్​బీర్​-ఆలియా(ranbir kapoor alia bhatt). ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'బ్రహ్మస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఆలియా(Aliabhatt RRR movie).. 'ఆర్​ఆర్​ఆర్', 'గంగూబాయ్​ కతియావాడి' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే 'డార్లింగ్స్​', 'రాకీ ఔర్​ రానీ కీ ప్రేమ్​ కహానీ'లో నటిస్తోంది. కాగా, రణ్​బీర్​.. 'షంషేరా' సహా మరో చిత్రంలో నటిస్తున్నాడు.

ఇదీ చూడండి: అగరబత్తీల వ్యాపారంలోకి ఆలియా భట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.