ETV Bharat / sitara

'దృశ్యం 2'లో నేను నటించట్లేదు: రానా

author img

By

Published : Mar 13, 2021, 8:03 PM IST

rana
రానా

'దృశ్యం 2' తెలుగు రీమేక్​లో తాను నటించట్లేదని స్పష్టం చేశారు హీరో రానా. ప్రస్తుతం ఆయన 'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు.

తన తదుపరి సినిమా గురించి ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటుడు రానా స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ చాట్‌ షో ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన తన తదుపరి సినిమాల గురించి కొన్ని విశేషాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా 'దృశ్యం-2'లో రానా నటించనున్నారంటూ వస్తోన్న వార్తలపై స్పందించమని విలేకర్లు కోరగా.. అవన్నీ పుకార్లు మాత్రమేనని, ఆ సినిమాలో తాను నటించడం లేదని స్పష్టతనిచ్చారు.

మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించిన మలయాళీ సూపర్‌హిట్‌ చిత్రం 'దృశ్యం-2'. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ మెండుగా పొందింది. కాగా, త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నారు. వెంకటేశ్‌, మీనా ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ కీలకపాత్ర పోషించనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రానా తాజాగా స్పందించారు.

మరోవైపు రానా ప్రస్తుతం 'అరణ్య' విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. ఏనుగుల సంరక్షణ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రానా ఆదివాసి పాత్రలో దర్శనమివ్వనున్నారు. అలాగే, పవన్‌-రానా ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా ఇది రానుంది.

ఇదీ చూడండి: బన్నీ ఇచ్చిన సలహా ఎప్పటికీ మరిచిపోను: రానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.