ETV Bharat / sitara

'అరణ్య' ట్రైలర్​ రిలీజ్​ డేట్​.. 'వై' మోషన్​ పోస్టర్​

author img

By

Published : Feb 28, 2021, 12:38 PM IST

Updated : Feb 28, 2021, 12:46 PM IST

రానా నటించిన 'అరణ్య' సినిమా ట్రైలర్​ను మార్చి 4న విడుదల చేయనున్నారు. కాగా, నటుడు శ్రీకాంత్​, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన 'వై' సినిమా మోషన్​ పోస్టర్​ రిలీజ్​ అయింది.

aranya
అరణ్య

దగ్గుబాటి హీరో రానా కథానాయకుడిగా నటించిన బహుభాషా చిత్రం 'అరణ్య'. ఈ సినిమాకు సంబంధించిన హిందీ ట్రైలర్​(మార్చి 4), తమిళ, తెలుగు ట్రైలర్​​ మార్చి 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. విష్ణు విశాల్‌ కీలక పాత్ర పోషించాడు. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. హిందీలో 'హాథీ మేరే సాథీ', తమిళ్‌లో 'కాండన్‌' పేర్లతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నెల మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం.

Rana
అరణ్య

నటుడు శ్రీకాంత్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా 'వై' మోషన్​ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. రాహుల్​ రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను బాలు అడుసుమిల్లి తెరకెక్కిస్తున్నారు.

Rana
వై

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్​ పూరి హీరోగా వస్తోన్న చిత్రం 'రొమాంటిక్'​. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిల్​ పాదూరి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీని మార్చి 1 ఉదయం 10 గంటలకు ప్రకటించనున్నారు.

Rana
రొమాంటిక్​

తాప్సీ హీరోయిన్​గా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో 'దోబారా' సినిమా రూపొందనుంది. తాజాగా ఈ సినిమాలో నటుడు పవైల్​ గులాటి నటించనున్నట్లు తాప్సీ తెలిపింది. వీరిద్దరు కలిసి 'థప్పడ్' సినిమాలోనూ జంటగా నటించారు. ​

లక్ష్మీరాయ్​, శ్రీకాంత్​ నటించిన 'గర్జన' సినిమా టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి జె. ప్రతిభన్​ దర్శకత్వం వహించారు. ఈ టీజర్​ ఆద్యంతం అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'మర్యాదక్రిష్ణయ్య'గా సునీల్.. ఫోక్​ సాంగ్​తో సాయిపల్లవి

టాలీవుడ్ మార్చ్: ఈ నెల ప్రేక్షకులకు వినోదమే వినోదం!

Last Updated : Feb 28, 2021, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.