ETV Bharat / sitara

పోలీస్ లుక్​లో రామ్.. 'బంగార్రాజు' రూ.50 కోట్ల వసూళ్లు

author img

By

Published : Jan 17, 2022, 12:36 PM IST

Updated : Jan 17, 2022, 1:15 PM IST

ram bangarraju
రామ్ మూవీ-బంగార్రాజు కలెక్షన్

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రామ్​ 'ద వారియర్' ఫస్ట్​లుక్, నాగార్జున 'బంగార్రాజు' సినిమా కలెక్షన్ గురించి ఉంది.

RAPO19 first look: ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ఫస్ట్​లుక్​ వచ్చేసింది. 'ద వారియర్' అనే టైటిల్​ ఖరారు చేస్తూ, సోమవారం పోస్టర్​ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో పోలీస్​గా నటిస్తున్న రామ్.. కెరీర్​లో తొలిసారి ఈ పాత్ర చేస్తున్నారు. ఈ పోస్టర్​లో మీసకట్టుతో స్టైలిష్​గా కనిపిస్తూ, అభిమానులను అలరిస్తున్నారు రామ్.

Ram new movie first look
రామ్ 'ద వారియర్' మూవీ

ఇందులో రామ్​ సరసన కృతిశెట్టి హీరోయిన్​గా చేస్తోంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

అయితే ఈ పోస్టర్​ రావడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు యువ కథానాయకుడు హవీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు 'వారియర్' అనే టైటిల్​ పెట్టడం విశేషం.

havish new movie
హీరో హవీష్

Bangarraju collection day 3: కింగ్ నాగార్జున 'బంగార్రాజు' సినిమా.. బాక్సాఫీస్​ దగ్గర అభిమానుల్ని అలరిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.53 కోట్ల గ్రాస్​ సాధించిందని చిత్రబృందం వెల్లడించింది. పోస్టర్​ కూడా రిలీజ్ చేశారు.

'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్​గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతిశెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. కల్యాణ్​కృష్ణ దర్శకత్వం వహించారు.

Bangarraju 3 days collection
బంగార్రాజు కలెక్షన్లు పోస్టర్

ఇవీ చదవండి:

Last Updated :Jan 17, 2022, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.