ETV Bharat / sitara

పునీత్​ ఫ్యామిలీని పరామర్శించిన రామ్​చరణ్​

author img

By

Published : Nov 3, 2021, 1:00 PM IST

Updated : Nov 3, 2021, 1:37 PM IST

ఇటీవల కన్నుమూసిన(ramcharan puneeth rajkumar) కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ ఫ్యామిలీని పరామర్శించారు రామ్​చరణ్.​ పునీత్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Ram Charan
రామ్​చరణ్​

పునీత్​ ఫ్యామిలీని పరామర్శించిన రామ్​చరణ్​

గుండెపోటుతో(ramcharan puneeth rajkumar) ఇటీవలే తుదిశ్వాస విడిచారు కన్నడ స్టార్​ హీరో పునీత్​ రాజ్​కుమార్(అప్పు)​. ఆయన లేరనే విషయాన్ని అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు(puneeth rajkumar death news). ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు బెంగళూరులోని పునీత్​ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను, అన్న శివరాజ్​కుమార్​ను పరామర్శిస్తున్నారు(puneeth rajkumar death cause). తాజాగా మెగాహీరో రామ్​చరణ్​ కూడా అక్కడికి వెళ్లారు. పునీత్​ కుటుంబసభ్యులను పరామర్శించి.. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అప్పు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. తాను కలిసిన వ్యక్తులలో పునీత్​ ఓ గొప్ప మనిషని కొనియాడారు.

Ram Charan
రామ్​చరణ్​

అక్టోబర్​ 2న హీరో నాగార్జున కూడా పునీత్​ ఇంటికి వెళ్లారు. అప్పు లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. తనకు శివన్నతో(పునీత్ అన్నయ్య) ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 3, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.