ETV Bharat / sitara

పునీత్​ నేత్రదానంతో ఆ నలుగురి జీవితాల్లో వెలుగు

author img

By

Published : Nov 1, 2021, 5:13 PM IST

Updated : Nov 1, 2021, 5:38 PM IST

నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​(Puneeth Rajakumar news). ఆయన నేత్రదానం(eye donation) చేయగా.. ఓ మహిళతో పాటు మరో ముగ్గురికి వైద్యులు చూపు తెప్పించారు.

Puneeth Rajakumar
పునీత్​ రాజ్​కుమార్​

గుండెపోటుతో అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిన కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్(Puneeth Rajakumar news)​.. నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. బెంగళూరు నారాయణ నేత్రాలయకు ఆయన కళ్లు దానం(eye donation) చేయగా.. వాటి ద్వారా వైద్యులు ఓ మహిళతో పాటు మరో ముగ్గురికి చూపు వచ్చేలా చేశారు.

నలుగురికి గత శనివారం శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగినట్లు చెప్పారు నారాయణ నేత్రాలయలోని ఆప్తమాలజిస్ట్​ డాక్టర్​ భుజంగశెట్టి. వారు ఇప్పుడు చూడగలుగుతున్నారని, అందరినీ గుర్తిస్తున్నారని తెలిపారు. డాక్టర్​ యతీస్​, డా. ప్రార్థన ఈ ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు.

Puneeth Rajakumar
శస్త్ర చికిత్సపై వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు

" డాక్టర్​ రాజ్​కుమార్​ కుటుంబం వారు చెప్పిందే చేశారు. తండ్రి హామీని పిల్లలను నిలబెట్టారు. తన తండ్రి మాట ప్రకారం తన కళ్లను దానం చేశారు అప్పు. పునీత్​ మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ, ఆయన నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. సాధారణంగా ఒక కంటిలోని కార్నియా రెండు పొరలను విడదీసి.. ఇద్దరికి చూపు వచ్చేలా చేస్తారు. ఇక్కడ రోగులు పైన ఉండే కార్నియా వ్యాధితో బాధపడుతున్నారు. మరో ఇద్దరు ఎండోథేలియాల్​తో(కింది పొర పాడైపోవటం) చూపు కోల్పోగా.. వారికి పునీత్​ రెండు కళ్లతో చూపు తెప్పించగలిగాం. ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆపరేషన్​ జరగలేదు. "

- డాక్టర్​ భుజంగశెట్టి, ఆప్తమాలజిస్ట్​, నారాయణ నేత్రాలయ.

రోగులకు వినియోగించని లింబాల్​ రిమ్​ ( కార్నియాకు సమీపంలో ఉండే తెల్లటి భాగం)ను ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు డాక్టర్ భుజంగషెట్టి. దాని ద్వారా రోగులకు లింబాల్​ స్టెమ్​ సెల్స్​తో అమర్చే విధంగా ప్లూరిపోటెంట్​ మూలకణాలను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. వాటిని రసాయనాలు, యాసిడ్​ వంటి వాటితో గాయమైన కళ్లకు ఉపయోగిస్తారని వివరించారు.

ఇదీ చూడండి: తండ్రిలానే పునీత్​ రాజ్​కుమార్​.. 2006లోనూ ఇలాగే!

Last Updated :Nov 1, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.