ETV Bharat / sitara

శిల్పకళా వేదికలో ఘనంగా రామ్​చరణ్​ పుట్టినరోజు వేడుకలు

author img

By

Published : Mar 27, 2021, 7:02 PM IST

హీరో రామ్​చరణ్​ పుట్టినరోజు వేడుకలను మెగా అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన వేడుకల్లో నిర్మాత దిల్​రాజు, సుప్రీమ్​ హీరో సాయిధరమ్​ తేజ్​, వైష్ణవ్​ తేజ్​ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.​

Ram charan Birthday
రామ్​చరణ్​ పుట్టినరోజు వేడుకలు

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్​ శిల్పకళా వేదికలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత దిల్​రాజు, మెగా హీరోలు సాయిధరమ్ ​తేజ్, వైష్ణవ్ తేజ్, తేజ సజ్జ, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మైత్రీ మూవీస్​ నిర్మాత నవీన్​తో పాటు చిరంజీవి రక్తనిధి కేంద్రం నిర్వాహకులు స్వామినాయుడు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కరోనా సమయంలో ప్రజలకు సేవలందించిన పలువురిని నిర్మాత దిల్​రాజు, సాయితేజ్​లు ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసిన సాయితేజ్.. మెగాస్టార్​తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అభిమానుల ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: రామ్​ చరణ్​కు ఎన్టీఆర్, రాజమౌళి​ స్పెషల్​ విషెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.