ETV Bharat / sitara

బాలీవుడ్​లో నా ఫేవరెట్ హీరో అతడే: జక్కన్న

author img

By

Published : Dec 18, 2021, 11:22 AM IST

Updated : Dec 18, 2021, 2:37 PM IST

brahmastra
రన్​బీర్​ కపూర్​

బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్​ తనకు అత్యంత ఇష్టమైన నటుడని చెప్పారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. రణ్​బీర్​, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలకపాత్రల్లో నటిస్తోన్న 'బ్రహ్మాస్త్ర' చిత్ర దక్షిణాది మోషన్ మోస్టర్​ను జక్కన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా శివుడితో రణ్​బీర్​ను పోల్చారు రాజమౌళి.

బాలీవుడ్​లో తన ఫేవరెట్ యాక్టర్​ రణ్​బీర్​ కపూర్​ అని చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. రణ్​బీర్​​ నటిస్తున్న భారీ బడ్జెట్​ సినిమా 'బ్రహ్మాస్త్ర' చిత్ర దక్షిణాది మోషన్ పోస్టర్​ను జక్కన్న విడుదల చేశారు. ఈ సినిమాలో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, నాగార్జున, ఆలియా భట్, మౌనిరాయ్ వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా శనివారం ప్రెస్​మీట్​ నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా రణ్​బీర్​ నటనపై ప్రశంసలు కురిపించారు రాజమౌళి.

brahmastra
ప్రెస్​మీట్​లో చిత్రబృందం

"బాలీవుడ్​లో నా ఫేవరెట్ హీరో రణ్​బీర్. అతను పెద్దగా యాక్టింగ్ చేస్తున్నట్లు కనపడడు. కళ్లలోనే ఇంటెన్సిటీ కనబడుతుంది. చూసేందుకు నార్మల్​గా కనబడినా అతడిలోపల ఎంతో శక్తి దాగుంది. అచ్చం శివుడిలా. ఈ సినిమాలో అతడిని ఎంపిక చేయడమే పెద్ద ప్లస్. ఇక దర్శకుడు అయాన్​ తొలుత నా దగ్గరికి వచ్చినప్పుడు.. ఇతను నాకన్నా పిచ్చోడిలా ఉన్నాడే అనిపించింది. నాకన్నా అతడికి సినిమా పిచ్చి ఎక్కువ. 'బ్రహ్మాస్త్ర' గురించి చెబుతుంటే.. ఒక బ్రహ్మాండం సృష్టించబోతున్నాడనిపించింది."

-రాజమౌళి, దర్శకుడు

రాజమౌళి ఆశీర్వాదం తీసుకున్న రణ్​బీర్​..

brahmastra
రాజమౌళి ఆశీర్వాదం తీసుకుంటున్న రణ్​బీర్

ప్రపంచంలోనే తనకు అత్యంత ఇష్టమైన దర్శకుడు రాజమౌళి అని చెప్పారు రణ్​బీర్​. దేశంలో ఆయనే నెం.1 అని కొనియాడారు.​ స్టేజి మీదకు వచ్చేటప్పుడు రాజమౌళి ఆశీర్వాదం తీసుకున్నారీ బాలీవుడ్ హీరో​. అనంతరం నాగార్జున బ్లెస్సింగ్స్​ కూడా తీసుకున్నారు.

brahmastra
'బ్రహ్మాస్త్ర'

"ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. దక్షిణాదిలో దీనిని రాజమౌళి ప్రెజెంట్​ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచలోనే నాకు అభిమాన దర్శకుడాయన. అమితాబ్​ తర్వాత అతిపెద్ద నటుడు నాగార్జున. ఆయన కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం."

-రణ్​బీర్ కపూర్, నటుడు

రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారంటేనే ఈ సినిమా స్థాయేంటో అర్థం చేసుకోవచ్చని నాగార్జున అన్నారు. అందుకు సినిమాలోని నటుడిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు ప్రముఖ ఫిల్మ్​మేకర్ కరణ్ జోహర్​, హీరోయిన్ ఆలియా భట్​ హాజరయ్యారు.

brahmastra
ఈవెంట్​కు విచ్చేస్తున్న రన్​బీర్​, అలియా, రాజమౌళి

'బ్రహ్మాస్త్ర'ను తెలుగు, హిందీ సహా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను 2022 సెప్టెంబర్​ 9న విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రణ్​బీర్​కు అమితాబ్ ఖరీదైన గిఫ్ట్.. ధరెంతో తెలుసా?

Last Updated :Dec 18, 2021, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.