ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​, 'రాధేశ్యామ్​' రిలీజ్​ డేట్స్​.. దిల్​రాజు బిగ్​ న్యూస్​!

author img

By

Published : Jan 29, 2022, 4:20 PM IST

rrr release date
radhe shyam release date

RRR Release Date: 'ఆర్​ఆర్ఆర్'​, 'రాధేశ్యామ్', 'భీమ్లా నాయక్​' వంటి బడా సినిమాల రిలీజ్​ డేట్లపై ఆసక్తికర ప్రకటన చేశారు ప్రముఖ నిర్మాత దిల్​ రాజు. ఫిబ్రవరి చివరి వారం నుంచి వారానికో పెద్ద సినిమా విడుదలవుతుందని అన్నారు.

RRR Release Date: ఫిబ్రవరి చివరి వారం నుంచి వారానికో పెద్ద సినిమా విడుదలవుతుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. అయితే విడుదల తేదీల విషయంలో నిర్మాతల మధ్య సమన్వయం ఉంటేనే అనుకున్న తేదీకి సినిమాలు విడుదలవుతాయని పేర్కొన్నారు. అందుకే 'ఆర్ఆర్ఆర్' లాంటి చిత్రాలు రెండు విడుదల తేదీలను ప్రకటించాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అందులో ఏదో ఒక తేదీ అనుకూలంగా ఉంటే విడుదలవడం తథ్యమన్నారు.

producer dil raju
నిర్మాత దిల్​ రాజు
rrr release date
'ఆర్​ఆర్ఆర్'​

'ఆర్ఆర్ఆర్'ను మార్చి 18 లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించింది చిత్రబృందం. మరో పాన్​ఇండియా మూవీ 'రాధేశ్యామ్​'ను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, త్వరలో రిలీజ్​ డేట్​ కూడా ప్రకటిస్తామని ఇటీవల ఆ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ స్పష్టం చేశారు. మార్చి 4న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్​లో విడుదల కానుందని సమాచారం.

radhe shyam release date
'రాధేశ్యామ్'

సంక్రాంతికి రావాల్సిన 'భీమ్లా నాయక్'.. 'ఆర్ఆర్ఆర్' కోసం పక్కకు తప్పుకొంది. ఫిబ్రవరి 25న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు అది కాస్త వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేసవి ప్రారంభంలో అంటే ఏప్రిల్ చివర్లో రానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరిన్ని తెలుగు సినిమాల కొత్త రిలీజ్​ డేట్స్ త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

bheemla nayak release date
'భీమ్లా నాయక్​'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: అభిమానం అతిక్రమిస్తే? ఇక అంతే సంగతులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.