ETV Bharat / sitara

ప్రియమణి పాత్రకు ఎఫైర్?.. సీజన్​ 2లో సమాధానం

author img

By

Published : May 22, 2021, 5:02 PM IST

Updated : May 22, 2021, 5:26 PM IST

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' విడుదలకు దగ్గరపడిన నేపథ్యంలో ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ప్రియమణి. తన పాత్రకు సంబంధించిన ఆ విషయానికి సమాధానం ఈ భాగంలో దొరుకుందని తెలిపింది.

Priyamani getting bombarded with questions on the Family Man 2
ప్రియమణి

'ద ఫ్యామిలీ మ్యాన్ 2'.. జూన్ 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్​ అంచనాల్ని పెంచుతోంది. అయితే ఇందులో సూసైడ్​ బాంబర్​గా నటించిన సమంతతో పాటు ప్రియమణి పాత్రకు సంబంధించిన ఓ విషయం అభిమానులను ఆసక్తి కలిగిస్తోంది.

భర్తతో ఎప్పుడూ గొడవ పడే మధ్య తరగతి భార్యగా ప్రియమణి తొలి సీజన్​లో నటించింది. అయితే తొలి భాగం అన్ని ఎపిసోడ్లు చూసిన పలువురు అభిమానులకు, ప్రియమణి పాత్రకు ఎఫైర్ ఉందేమో అనే చిన్న అనుమానం కలిగింది. దీని గురించి చాలామంది ఆమెనే నేరుగా అడిగేశారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియమణినే వెల్లడించింది. రెండో సీజన్​లో దానికి సమాధానం దొరుకుతుందని, కాకపోతే అది కాస్త ఆసక్తిగా ఉంటుందని చెప్పింది.

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' పూర్తిగా చెన్నై నేపథ్యంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సమంత సూసైడ్ బాంబర్​ కనిపించడం, ఫైట్లు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మనోజ్ భాజ్​పాయ్ ప్రధాన పాత్రలో నటించారు. రాజ్- డీకే ద్వయం దర్శకత్వం వహించారు.

ఇది చదవండి: ఉగ్రవాది పాత్ర కోసం చాలా కష్టపడ్డా: సమంత

Last Updated : May 22, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.