ETV Bharat / sitara

రామోజీ ఫిల్మ్​సిటీలో ప్రభాస్ 'ప్రాజెక్టు కె'

author img

By

Published : Feb 13, 2022, 6:34 AM IST

Prabhas project K: ప్రభాస్ రామోజీ ఫిల్మ్​సిటీలో సందడి చేస్తున్నారు. 'ప్రాజెక్టు కె' షూటింగ్​లో కీలక సన్నివేశాల్ని పూర్తి చేస్తున్నారు.

prabhas deepika
ప్రభాస్ దీపిక

Prabhas new movie: డార్లింగ్ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'ప్రాజెక్టు కె'. వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోంది. దీపికా పదుకొణె కథానాయిక. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మాత. అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.

prabhas project k shooting
ప్రాజెక్టు కె మూవీ షూటింగ్

సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న అత్యంత ఖరీదైన పాన్‌ ఇండియా చిత్రమిది. విజయవంతమైన 'మహానటి' తర్వాత నాగ్‌ అశ్విన్‌ తీస్తున్న చిత్రమిదే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.