ETV Bharat / sitara

'ఆ వీడియోలు లీక్ చేస్తా'.. పూనమ్​కు కుంద్రా బెదిరింపులు!

author img

By

Published : Jul 23, 2021, 4:36 PM IST

అశ్లీల వ్యాపారం కేసులో కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త రాజ్​కుంద్రాపై సంచలన ఆరోపణలు చేసింది నటి పూనమ్ పాండే. ఓ సమయంలో తనను కుంద్రా తీవ్రంగా వేధించాడని పేర్కొంది.

Poonam Pandey
పూనమ్ పాండే

అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్​కుంద్రాపై సంచలన వ్యాఖ్యలు చేసింది శృంగార తార పూనమ్ పాండే. తాను ఓ డీల్​కు నో చెప్పినందుకు కుంద్రా తన నగ్న చిత్రాలతో బ్లాక్​మెయిల్ చేశాడని ఆరోపించింది. దీనిపై గతంలోనే కుంద్రా మీద కేసు పెట్టింది పూనమ్. తాజాగా కుంద్రా అరెస్ట్ కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ న్యాయస్థానంపై నమ్మకముందని వెల్లడించింది.

"2019లో నేను, కుంద్రా కలిసి ఓ యాప్ ప్రారంభించాం. కాంట్రాక్ట్ ముగిశాక నేను అందులోంచి బయటకు వచ్చా. ఆ సమయంలో నన్ను కుంద్రా బెదిరించాడు. 'కాల్ చేయండి.. మీకోసం నగ్నంగా కనిపిస్తా' అన్న మెసేజ్​తో నా నగ్న ఫొటోలు, వ్యక్తిగత ఫోన్ నెంబర్ లీక్ చేశాడు. దీంతో ఆ సమయంలో నా మొబైల్ నాన్​స్టాప్​గా మోగుతూనే ఉంది. ప్రపంచ నలువైపుల నుంచి కాల్స్ వచ్చాయి. కొందరు అశ్లీల సందేశాలు, వీడియోలూ పంపారు. ఆ వేధింపులు భరించలేక రహస్య ప్రదేశానికి వెళ్లిపోయా. నేను బాధితులకు ఒక్కటే చెబుతున్నా. అందరూ మీరు పడిన బాధల్ని బయటకు వచ్చి చెప్పండి. మీ గొంతును వినిపించండి. కానీ ప్రస్తుతం నా మనసంతా శిల్పాశెట్టి, ఆమె పిల్లల గురించే ఆలోచిస్తోంది."

-పూనమ్ పాండే, నటి

కుంద్రా కస్టడీ పొడిగింపు

పోర్నోగ్రఫీ వ్యాపారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాజ్​కుంద్రా, ర్యాన్ తోర్పేలను.. మహారాష్ట్రలోని మెజిస్ట్రేట్​ కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇంకా కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని, మరో ఏడు రోజులు వారికి కస్టడీకి కోరారు. దీనిపై స్పందించిన కోర్టు వారికి జులై 27 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చూడండి: Raj Kundra: పోర్న్ ద్వారా వచ్చిన లాభాలు బెట్టింగు​ల్లో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.