ETV Bharat / sitara

'భీమ్లా నాయక్​​' చెప్పిన తేదీకే.. రిలీజ్​ డేట్స్​తో శ్రియ, రకుల్​

author img

By

Published : Nov 21, 2021, 7:44 PM IST

Bhemlanayak release date
సినిమా అప్డేట్స్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'భీమ్లానాయక్'​, 'గమనం', 'థ్యాంక్ గాడ్', 'మరక్కార్' సహా పలు చిత్రాల వివరాలు ఉన్నాయి.

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ 'భీమ్లా నాయక్​'(bheemla nayak release date) చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా 2022 జనవరి 12న రిలీజ్​ కానుంది. అయితే అదే సమయానికి ప్రభాస్​ 'రాధేశ్యామ్'​, రాజమౌళి 'ఆర్​ఆర్​ఆర్'​ కూడా విడుదల కానున్నాయి. దీంతో భీమ్లానాయక్​ విడుదల తేదీ వాయిదా వేస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. జనవరి 12న రిలీజ్​ అవ్వడం పక్కా అని ట్వీట్​ చేశారు. 'గుర్తుపెట్టుకోండి.. ఈ సారి కుడా మిస్​ అవ్వదు త్వరలోనే థియేటర్లలో కలుద్దాం' అని రాసుకొచ్చారు. అయితే చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

థియేటర్లలోనే

కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన చిత్రాల్లో 'గమనం'(gamanam shriya saran) ఒకటి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటం వల్ల త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల తేదీని ఖరారు చేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను పంచుకుంది. 'గమనం డిసెంబరు 10న.. కేవలం థియేటర్లలోనే' అని పేర్కొంది. ఈ సినిమాలో శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. పలు ఉపకథల సమ్మేళనంగా సుజనా రావు తెరకెక్కించారు. రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించారు. ఇళయరాజా స్వరాలందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రిలీజ్​ డేట్​

అజయ్ దేవ్​గణ్-సిద్ధార్థ్ మల్హోత్రా-రకుల్ ప్రీత్ సింగ్​ కలిసి నటించిన సినిమా 'థ్యాంక్ గాడ్'(rakul preet singh thank god). ఈ సినిమాను 2022 జులై 29న రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ మూవీకి ఇంద్రకుమార్ దర్శకుడు.

thank god
థ్యాంక్​ గాడ్​ రిలీజ్​ డేట్​

మోహన్​లాల్​ సినిమా

ప్రియదర్శన్‌ దర్శకత్వంలో మలయాళ సూపర్​స్టార్​ మోహన్‌లాల్‌ నటించిన చిత్రం 'మరక్కార్'(mohanlal marakkar release date). ఈ సినిమాను డిసెంబరు 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ మూవీలో అర్జున్‌, కీర్తి సురేష్‌, ప్రణవ్‌ మోహన్‌లాల్‌, కల్యాణి ప్రియదర్శన్‌, మంజూ వారియర్‌, సునీల్ శెట్టి, ప్రభు, సిద్దిక్, ముఖేష్, ఫాజిల్, సుహాసిని మణిరత్నంతో పాటు మరికొందరు ప్రముఖ నటులు నటిస్తున్నారు.

marakkar
మరక్కార్​

ఆకట్టుకుంటున్న ట్రైలర్​

విజయ్​సేతుపతి నటిస్తున్న చిత్రాల్లో 'కడైసి వివసాయ్'​ ఒకటి(kadaisi vivasayi vijay sethupathi movie). తాజాగా ఈ సినిమా ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి మనికందన్ దర్శకుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Radheshyam story: ప్రభాస్​ 'రాధేశ్యామ్​' కథ లీక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.