ETV Bharat / sitara

Pawan Kalyan: పవన్ సినిమా టైటిల్ & ఫస్ట్​లుక్​కు టైమ్ ఫిక్స్

author img

By

Published : Sep 8, 2021, 8:20 PM IST

Updated : Sep 8, 2021, 10:11 PM IST

'ఏ పవర్ ప్యాక్డ్​ అనౌన్స్​మెంట్' రానుంది. పవన్​ కొత్త సినిమా నుంచి వచ్చే ఆ ఆప్డేట్ ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ అది ఏమై ఉంటుంది?

PAWAN KALYAN HARISH SHANKAR MOVIE LATEST UPDATES
పవన్ కల్యాణ్

పవర్​స్టార్ పవన్​కల్యాణ్(Pawan Kalyan).. వరుస సినిమాల అప్డేట్స్​తో అభిమానుల్ని ఫుల్ ఖుష్ చేస్తున్నారు. ఆయన కొత్త చిత్రాల పాటలు, టీజర్లు ఇప్పటికే అలరిస్తుండగా, హరీశ్​ శంకర్(harish shankar pawan kalyan) దర్శకత్వం వహించే సినిమా అప్డేట్​కు టైమ్ ఫిక్స్ అయింది. గురువారం ఉదయం 9:45 గంటలకు దీనిని వెల్లడించనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.

.
.

అయితే టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేస్తారని అభిమానులు అనుకుంటున్నారు. మరోవైపు 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్​ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రం కోసం పవన్​ దాదాపు రూ.60 కోట్లు రెమ్యునరేషన్​ తీసుకుంటున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

.
.

ఇటీవల సమావేశమైన చిత్రబృందం.. త్వరలో షూటింగ్​ మొదలుపెట్టనున్నట్లు కూడా తెలిపింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. గతంలో పవన్-హరీశ్​ శంకర్​ కాంబోలో వచ్చిన 'గబ్బర్​ సింగ్'(gabbar singh) బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టి, అభిమానుల్ని తెగ అలరించింది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 8, 2021, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.